ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్ధికంగా బలమైన దేశాలు కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో చాలా వరకు చేతులు ఎత్తేయడం జరిగింది. యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ విషయంలో చాలా మూల్యం చెల్లించుకున్నయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ మొదటిలో ఇటలీలో తర్వాత స్పెయిన్ ఆ తర్వాత అమెరికాలో భయంకరంగా బలపడి చాలా మందిని బలితీసుకుంది. ప్రస్తుతం ఇండియాలో భయంకరంగా వ్యాప్తి చెంది రాబోయే రోజుల్లో పెను విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉంది. ఇటువంటి భయంకరమైన కరోనా వైరస్ ని కేవలం మూడు నెలల్లోనే జయించింది న్యూజిలాండ్ దేశం.

 

కరోనా వైరస్ బయటపడగానే ముందుగా ఆ దేశ ప్రధాని దేశ సరిహద్దులను మూసివేసి విమాన రాకపోకలకు బయట దేశాల తో సంబంధం లేకుండా దేశంలో కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. దేశంలో ఆంక్షలు చాలా కట్టుదిట్టంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో తాజాగా ఇటీవల మూడు నెలల తర్వాత దేశంలో నుండి పూర్తిగా కరోనా వైరస్ ని తరిమి కొట్టినట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ దేశంలో ఒక్క కరోనావైరస్ కేసు కూడా లేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

 

అంతేకాకుండా కరోనా వైరస్ తో పోరాడుతున్న చివరి రోగి కూడా కోలుకున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. చైనా లో వైరస్ బయటపడిన తర్వాత న్యూజిలాండ్ దేశంలో ఫిబ్రవరి 28న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత మే 22 వరకూ… 1504 కేసులు నమోదయ్యాయి. మే 22 తర్వాత ఇక కొత్త కేసులు రాలేదు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన క‌రోనా బాధిత మ‌హిళ వ్యాధి నుంచి కోలుకుని, సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ దేశ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని జసిందా అర్డెర్న్ త్వరలోనే ప్రసంగించి బోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: