ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఇప్పట్లో మానవాళిని వదిలేలా కనిపించడం లేదు. ఈ వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అష్టకష్టాలు పడుతున్నారు. ఇక అన్ని దేశాలు మిగతా అన్ని విషయాలను పక్కనపెట్టి కరోనాను కంట్రోల్ చేసే విషయంపై పూర్తిగా ఫోకస్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేసేందుకు మందును కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అప్పటి వరకు ఈ నిబంధనలు అమలు చేయడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నాయి. ఇక భారత దేశంలోనూ రెండు నెలలపాటు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేశారు.

 

IHG


 ఇక మరికొంతకాలం అమలు చేద్దాం అని భావించినా, మన దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అలాగే ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైపోవడంతో తీవ్ర అసహనం పెరిగిపోవడం వంటి కారణాలతో కేంద్రం నిబంధనలు సడలించింది. ఈ సడలింపులతో జనాలు రోడ్లపైకి యథేచ్ఛగా  తిరుగుతుండం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 24 గంటల్లోనే 3007 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే అక్కడ ఇప్పటి వరకు 85 , 975 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 


చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన పెరిగిపోతుంది. ఈ  నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయంపై అధ్యయనం చేయించింది. సెప్టెంబర్ రెండవ వారం తర్వాత దేశంలో అదుపులోకి వస్తుందని, ఆ అధ్యయనంలో తేలిందని వారు తేల్చారు. కరోనా వైరస్ నుంచి చికిత్స పొంది కోలుకున్నవారి సంఖ్య సమానం అయినప్పుడు మాత్రమే ఆ వైరస్ నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లు అవుతుందని, ఆ నివేదికలో పేర్కొన్నారు. డైలీ రిలేటెడ్ టు రిమూవల్ రేట్ మెథడాలజీ ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి మే 19 వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను పరిశీలించారు.


 పబ్లిక్ హెల్త్ డిప్యూటీ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, రూపాలీ రాయ్ ఇద్దరూ కలిసి దీనిపై అధ్యయనం చేశారు. బెయిలీ రిలేటివ్ రిమూవల్ రేట్ మెథడాలజీ ప్రకారం సెప్టెంబర్ మధ్యకాలం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లుగా వారు తమ అధ్యయనంలో తేల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: