ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో వివాదంలో ఇరుక్కుంటుంది. ముఖ్యంగా న్యాయస్థానాలు వ్యతిరేక తీర్పు లతో అటు ప్రజల్లోనూ ఇటు ప్రతిపక్షాల ముందు పరువు పోతున్నట్లు పరిస్థితి మారుతోంది. ఇప్పటికే రంగుల విషయంలో అదేవిధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం జరిగింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక వివాదంలో ఇరుక్కుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళా డాక్టర్ ఏపీ ప్రభుత్వ సర్కారుపై హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు దారుణంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ డాక్టర్ అనిత రాణి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.

IHG

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో నియోజకవర్గం లోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో అనితారాణి అనే డాక్టర్ గత డిసెంబర్ లో విధుల్లో చేరారు. అయితే ఈ సందర్భంలో తన క్రింద సిబ్బంది అవినీతి చేస్తుండటంతో డాక్టర్ అనిత రాణి ప్రశ్నించినందుకు ఆమెకు అధికార పార్టీ నుండి వేధింపులు మొదలైనట్లు...మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ రోజున తనను హాస్టల్ గదిలో నిర్బంధించి వైసీపీ నాయకులు వేధించినట్లు దుర్భాషలాడినటు డాక్టర్ అనిత రాణి చెప్పుకొచ్చింది.

IHG

అంతేకాకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లినా ఫొటోలు, వీడియోలు తీశారని.. కోర్టులో వేసిన పిటిషన్‌లోనూ పేర్కొన్నారు. వైసీపీ నేతల వేధింపులకు సాక్ష్యాలుగా వీడియోలు కూడా ఉన్నాయని.. ఆ వీడియోలతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ అనితా రాణి అంటున్నారు. ఈమెకు అండగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉండటంతో హైకోర్టులో ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేయటంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ వేయటంతో ఈమె వేసిన పిటిషన్ ని ఆధారం చేసుకుని న్యాయస్థానం మళ్లీ సీబీఐ  విచారణ అంటే ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లే అని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: