సీనియర్ నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై వస్తున్న ఆరోపణలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశాడు. ఏ పార్టీ తరుపున రాకుండా తనంతట తానుగా మీడియా సమావేశం పెట్టి రెండు ప్రభుత్వాలకు మద్దతు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మాట్లాడటం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు జగన్ సమర్థవంతమైన నాయకులు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి విషయంలో అవగాహన ఉండి అన్నదమ్ముల్లా పరిష్కరించుకునే విధంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం నెలకొన్న జల వివాదం పై కూడా అనుకూలమైన వాతావరణంలో పరిష్కారం దిశగా అడుగులు వేస్థారని ఆ విధంగా భావిస్తున్నానని అన్నారు .

 

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించి కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలు వాస్తవం అయితే నేనే అతనికి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి 'ఓటుకు నోటు కేసు' గురించి అదే విధంగా కొన్ని అవినీతి ఆరోపణలు ఆయన మీద చేశారు. ఆ తర్వాత మహానాడు జరుగుతున్న సమయంలో బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండదు అని దాని మధ్యలో చంద్రబాబు పడగోడతారని చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. చంద్రబాబు పడగొడితే పడిపోవటానికి అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ది ఎన్టీఆర్ కాదని జగన్ అని చెప్పుకొచ్చారు.

 

వచ్చే 15 సంవత్సరాలు వైఎస్ జగనే ముఖ్యమంత్రి అని తేల్చి చెప్పేశారు. కాబట్టి బాలకృష్ణ టెన్షన్ పడక్కర్లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే రెండు ప్రభుత్వాల తరఫున ఇంత హడావిడిగా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం పెట్టడం వెనకాల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని తెలుగుదేశం పార్టీకి అంట కట్టాలని చూస్తున్నా కొన్ని పొలిటికల్ పార్టీలకు చెక్ పెట్టడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఈ విధంగా పోసాని కృష్ణ మురళి ని తెర వెనక నుండి రెండు ప్రభుత్వాలకు చేయించే విధంగా మాట్లాడించినట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: