దేశంలోకరోనా వైరస్ ప్రభావం ప్రతిరోజూ పెరిగిపోతుంది. దేశంలో కరోనా వ్యాప్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు వెల్లడవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 206 మంది మరణించారు.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది.  కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రార్థనాస్థలాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకొన్నాయి. అన్నిరాష్ట్రాల్లో నేటి నుంచి దేవాలయాలు తెరిచారు.. భక్తులకు కిట కిటలాడారు.

 

 అయితే తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇందుకు భిన్నంగా ఉన్నది. చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ ఆలయం మొదలుకొని చిన్న గుడి కూడా తెరుచుకోలేదు. ప్రార్థనాస్థలాలను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గుడ్లు, గోపురాలు మూతపడి ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై నగరంలో కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో.. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకొన్నది. దాంతో ఎన్నో రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్న ఆలయాల్లో దర్శనాలు కల్పించవద్దని ప్రభుత్వం సూచించింది. అయితే రాష్ట్రాల్లో ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.

 

కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దాదాపు 17 వేల మంది చికిత్స పొంది వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, చెన్నైలోని మరో రెండు ల్యాబులకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వడంతో మొత్తం ల్యాబుల సంఖ్య 76కే చేరాయి.  ఇప్పటికే..  తమిళనాడులో కొవిడ్‌-19 కేసులు 31 వేల మార్కును దాటాయి.  తమిళనాడు యొక్క కొవిడ్‌-19 కేసుల్లో 86 శాతం లక్షణాలు లేనివిగా గుర్తించబడ్డాయిని, లాక్‌డౌన్‌ కారణంగానే కొంతమేర కేసులు అదుపులోకి వచ్చాయని ముఖ్యమంత్రి కే పళనిస్వామి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: