రాజ్యాంగం గురించి పచ్చ పార్టీయే చెప్పాలి. రాజ్యాంగ విలువలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతగా దారుణంగా అవమానింపబడ్డారో నాటి పత్రికలు తిరగేస్తే చాలు. ఇక తెలుగుదేశం పార్టీ ఏ తప్పూ చేయకపోతే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. అది కూడా దారుణంగా ఓడించిన తరువాత అదే పార్టీలో ఉన్న కరణం బలరాం, మద్దాలి గిరి లాంటి ఎమ్మెల్యేలు చెబుతున్న తరువాత కూడా ఆ పార్టీ నాయకులు ఇంకా  ఆలోచించుకోకుండా ఎదుటి పక్షం మీద బురద జల్లి పబ్బం గడుపుకోవాలని చూడడం విడ్డూరమే.

 

రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు నారా లోకేష్. జగన్ రాజ్యాంగం వేరు అంటున్నారు. మరి నారా వారి రాజ్యాంగం టీడీపీ హయాంలో నడిచిందా అని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. నారా వారి రాజ్యాంగంలో మహిళా తాశీల్దార్ ని అధికార పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని కొట్టినా కేసులు ఉండవా. కాల్ మనీ సెక్స్ రాకెట్ సంగతేంటి అని కూడా నిలదీస్తున్నారు.

 

ఎమ్మెల్యేలను ఒక్క పెట్టున పక్క పార్టీ నుంచి టోకున కొనుగోలు చేయాలని ఏ రాజ్యాంగం టీడీపీకి  చెప్పిందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపుల చట్టం రాజ్యాంగంలోనే కదా ఉంది. మరి దాన్ని పాటించారా అని అడుగుతున్నారు. ఇక ఇసుక మాఫియాలు, దందాలు, విశాఖ భూ కబ్జాలు ఏ రాజ్యాంగం ప్రకారం చేశారని కూడా వైసీపీ నేతలు అడుతున్నారు.

 

సరే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే ప్రజలు వైసీపీ సర్కార్ కి కూడా టీడీపీ మాదిరిగానే గుణపాఠం చెబుతారు. కానీ ఎదుటి పార్టీని నిత్యం ఆడిపోసుకోవడం కంటే ప్రజా సమస్యలపైన ఈ ఏడాదిలో టీడీపీ చేసిన పోరాటాల సంగతేంటని కూడా అడుగుతున్నారు. 

 

మొత్తం మీద చూసుకుంటే ఏడాదిలో అధికార పక్షం విఫలం అయిందని టీడీపీ నేతలు అంటూంటే టీడీపీ ఒక విపక్షంగా దారుణంగా ఫెయిల్ అయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక ఎవరు పాస్ అయ్యారో జనం మరో నాలుగేళ్ళలో ఎటూ తీర్పు చెబుతారు కానీ మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాగాన్ని అపహాస్యం చేయడం ఎవరినీ మంచిది కాదు అని కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: