జగన్ ఏడాది పరిపాలనలో విమర్శలు చేస్తోంది సొంత పార్టీకి చెందిన నాయకులు కావడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు జగన్ ఏడాది పరిపాలన ఫెయిల్ అయ్యింది అనటానికి సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలే ఆధారాలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే మరోపక్క మాత్రం జగన్ పై విమర్శలు చేస్తోంది చాలా వరకు చూస్తే రాజకీయాలలో సీనియర్లు. ధర్మాన ప్రసాదరావు గాని అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇలా ఎవరిని చూసినా గతంలో వీళ్లంతా కిరణ్ కుమార్ రెడ్డి మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి కింద పనిచేసిన క్యాబినెట్ మంత్రులు కానీ వాళ్ల పాలనకు జగన్ పరిపాలనకు చాలా తేడా ఉంది. అందువల్లే వీళ్లు జగన్ పరిపాలన విషయంలో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అన్నట్లు మేధావులు ఏపీ రాజకీయాల్లో నెలకొంటున్న పరిణామాలపై వ్యాఖ్యానిస్తున్నారు.

 

గతంలో ముఖ్యమంత్రి పరిపాలన చూస్తే ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉండేవారిని కానీ జగన్ పరిపాలన చూస్తే తాను ప్రజలు మాత్రమే ఇంటరాక్షన్ ఉండేవిధంగా పాలన ఉందని మేధావులు అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో వైసిపి పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి విమర్శలు కేవలం వారి అసమర్థ వ్యాఖ్యలని రాష్ట్రంలో చాలావరకు పరిపాలనపై ప్రజలకు సంతృప్తికరంగానే అభిప్రాయం నెలకొందని అంటున్నారు. ప్రజల సొమ్ము మరియు ప్రజలు అనుభవించే విధంగా జగన్ పరిపాలన చేస్తున్నారని ప్రజలు అనుకుంటూన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాబట్టి పార్టీలో వేరే రకమైన ఆలోచనలు ఆశించి చేరిన ప్రజాప్రతినిధులకు జగన్ పరిపాలన నచ్చదు గాని…. ప్రజలకు మాత్రం జగన్ పాలన అదిరిపోయే రీతిలో ఉందని., ఇలాంటి టైమ్ లో పార్టీని వీడి వెళ్ళిపోయే నాయకులకు రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉండదని ఎందుకంటే జగన్ మరియు ప్రజల బాండింగ్ గ్రామ వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థ ద్వారా గట్టి పడిందని ఈ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారని మేధావులు అంటున్నారు.

 

కాబట్టి పార్టీ నుండి ఏ నాయకులు వెళ్లిన రాష్ట్రంలో రాజకీయం మొత్తం జగన్ సక్సెస్ చుట్టూ నడిచే విధంగా ఉండటంతో… పార్టీని విడిచి వెళ్ళే నాయకులకు పొలిటికల్ కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుందని అభివర్ణిస్తున్నారు. ఈ విధంగా పరిపాలన ఐదు సంవత్సరాలు చేసుకుంటే ఎవరిని ఆకర్షించే పని కూడా జగన్ కి అవసరం ఉండదని చివరికి వచ్చేసరికి పార్టీలో ఎగబడి మరీ నాయకులు జాయిన్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: