జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా భయంకరంగా తీవ్రస్థాయిలో విమర్శించిన నాయకులలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక విషయంలో గానీ మరియు ఇంగ్లీష్ మీడియం విషయంలో గా తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. ప్రతి విషయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు అప్పట్లో అన్నీఇన్నీ కావు. ఎప్పుడైతే బీజేపీ పార్టీతో చేతులు కలపడం జరిగిందో జనసేన స్పీడ్ ఏపీ రాజకీయాల్లో తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా వైకాపా పార్టీని విమర్శించే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్దిగా స్లో అయ్యారు.

 

ఇలాంటివి పరిస్థితి నెలకొన్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జగన్ పరిపాలన గురించి ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఎవ్వరూ ఊహించని కామెంట్లు చేశారు. నాగబాబు జగన్ పరిపాలన గురించి ఏమన్నారంటే..“జ‌గ‌న్ గారు ప్ర‌త్య‌ర్థి పార్టీ అయినంత మాత్రాన ప్ర‌తిసారి ఎదుటివారిని విమ‌ర్శించాల‌నే చెత్త ఆలోచ‌న, రెగ్యుల‌ర్ రాజ‌కీయ మాన‌సిక మ‌న‌స్త‌త్వం నాకైతే లేదు. జ‌గ‌న్ గారు చేసిన మంచి ప‌నులు కొన్ని ఉన్నాయి. వైద్యం, ఆరోగ్య‌శ్రీ‌కి సంబంధించి, పోలీసుల‌కు సెల‌వులు ఇవ్వ‌డం లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఆయ‌న ఇంకా బాగా చేయ‌గ‌ల‌రు. అంటే చేసింది త‌క్కువ‌. చేయ‌నిది ఎక్కువ‌. కానీ రాజ‌కీయాల‌కు వ‌చ్చేస‌రికి మాత్రం వైసీపీని, టీడీపీని క‌చ్చితంగా వ్య‌తిరేకిస్తాం” అని నాగ‌బాబు జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

 

కాగా ఏడాది పరిపాలనలో సొంత పార్టీలో ఉన్న నాయకులు విమర్శలు చేస్తున్న ఈ టైంలో జగన్ ఆ వ్యాఖ్యలు గురుంచి తెగ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ అధ్యక్షడు సోదరుడు నాగబాబు ఈ ప్రభుత్వ పని తీరు పై పాజిటివ్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయి. కేవలం పార్టీ లో డబ్బులు వ్యక్తిగత లాభాన్ని ఆశించి వచ్చిన వారికి మాత్రమే ప్రభుత్వం పనితీరు నచ్చటం లేదు అని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి వైసీపీ పార్టీలో నాయకులు చేస్తున్న వ్యాఖ్యల విషయంలో జగన్ ఓ క్లారిటీకి వచ్చేస్తే బెటరని...ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీకి అది జనసేన పార్టీకి ఇంత క్లారిటీ ఉన్న టైంలో...ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకుల విషయంలో జగన్ పట్టించు కోకుండా ఉంటే బెటర్ అనే టాక్ ఏపీ రాజకీయాల్లో వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: