అవును ఈ డైలాగ్ చాలా పాపులర్. దాదాపు నాలుగు దశాబ్దాల  క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ ప్రముఖ నటుడు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగు ఇపుడు పసుపు పార్టీకి చక్కగా అన్వయించుకోవచ్చు. నిజమే తెలుగుదేశం పార్టీ ఇపుడు చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎంతలా అంతా గతంలో ఎన్నడూ  లేనంతగా.

 

ఇంకా గట్టిగా చెప్పాలంటే చరిత్రలో ఎన్నడూ లేనంతలా. తెలుగుదేశం పుట్టిన ఇన్ని దశాబ్దాల కాలంలో కూడా ఇంతలా చేవ లేక మూలన కూర్చోలేదు. ఒక ఎన్నికలో ఓడితే వెంటనే సర్దుకుని మళ్ళీ ధీటుగా, పోటీగా లేచి నిలబ‌డేది. కానీ నిన్నటి ఎన్నికల్లో  తెలుగుదేశం ఓటమి దారుణం. కేవలం 23 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి.

 

అటువంటి పార్టీ  ఏడాదిగా ఏమైనా సాధించిందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఇక ఓడిన మరుసటి రోజు నుంచి జగన్నే విమర్శిస్తూ తప్పుడు వ్యూహంతోనే ముందుకుపోయింది. ఏ పార్టీ అయినా ఓటమిపైన నిజాయతీగా సమీక్ష చేసుకోవాలి. తెలుగుదేశం అది మరచిపోయింది. అందుకే మహానాడులోనూ జగన్నామస్మరణమే వినిపించింది.

 

ఇక ఇపుడు ఏడాది పాలనకే చార్జిషీట్ అంటోంది. నానా తిట్లూ తిడుతోంది. జనం ఇంకా ఓటేసిన చేతికి   సిరా ఆరలేదని గుర్తు చేస్తున్నారు. అధికార వియోగంతో ఉన్న టీడీపీ తొందరతనాన్నీ చూస్తున్నారు. ఇపుడే ఇంత అసహనమా అని నివ్వెరపోతున్నారు. ఇపుడే చార్జిషీట్లు పెడితే మిగిలిన నాలుగేళ్ళ కాలానికి ఏం చేస్తారని అంటున్నారు.

 

ప్రజా వ్యతిరేకత జగన్ కి వెల్లువలా పెరిగిందిట. ఇదీ టీడీపీ ఏడాదికే వచ్చిన అభిప్రాయం. సరే జగన్ కి వ్యతిరేకత ఉందో లేదో స్థానిక ఎన్నికలు ఉన్నాయిగా. అవి చెబుతాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే నైతికంగా రాజకీయంగానూ నెగ్గినట్లు. మరి అంతవరకూ ఆగకుండా ప్రజావ్యతిరేకత అంటే జనం ఏమబుకుంటారో అన్న తెలివిడి లేకపోతే ఎలా.  మొత్తానికి టీడీపీ  పొలిటికల్ రూట్ మాత్రం చిత్రాతిచిత్రంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: