క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నాయకుడు తమ అసంతృప్తిని బహిరంగంగా చెబుతుండడం పార్టీ అధినేతకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు వరుసగా పార్టీలోని నాయకులంతా ఇదే రకమైన రాగం వినిపిస్తుండటంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొద్ది రోజులుగా చూసుకుంటే ఒక్కో ఎమ్మెల్యే జగన్ తీరుపై బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్న పరిణామాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఇసుక వ్యవహారంలో నాయకులకు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉంది. అప్పటి అధికార పార్టీ టీడీపీని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వచ్చినా, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎటువంటి న్యాయం జరగకపోగా అవమానాలు ఎదురవుతున్నాయని చాలామంది వైసిపి సీనియర్ నాయకులు ఉన్నారు. 

IHG


గత తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన లావాదేవీల కారణంగా, టిడిపి ప్రభుత్వం తీవ్ర అపఖ్యాతి మూటగట్టుకుంది. టిడిపి నాయకులు భారీ ఎత్తున ప్రజలను దోచుకున్నారని అప్పట్లో సాక్ష్యాలతో సహా నిరూపించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిధిలోకి రీచ్ లను తీసుకు రావడంతో పాటు, సరికొత్త విధానంలో ప్రజలకు ఇసుక అందిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఇసుక కావలసినవారు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే కొత్తగా ఇసుక పాలసీ తీసుకు వచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం చొరవ తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. 


ఇసుక కొరత కారణంగా నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారు చేసేందుకు పని లేక, ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడడం వంటి పరిణామాలు ఎన్నో జరిగాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో నిరాహార దీక్ష చేశారు.  ఏపీ సీఎం జగన్ సరికొత్త రీతిలో ఇసుక పాలసీని ప్రారంభించారు. దీంట్లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు, ఇసుక పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే అనేక అక్రమాలపై ప్రత్యేక అధికారాలు, నియామకం కూడా చేపట్టారు. అలాగే ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపాలని ఎస్పీలకు సూచించారు.


ఇక ఇసుక పంపిణీ వ్యవస్థ మొత్తం కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండేలా అక్రమాలపై ఎస్పీలకి బాధ్యతలు అప్పగించడం వంటివి జగన్ సూచనలతో జగన్ సూచించడం జరిగాయి. ఇంత వరకు సీఎం జగన్ చెప్పినవి చెప్పినట్టు సక్రమంగానే సాగాయి. కానీ ప్రతి విషయంలో అధికారుల జోక్యం ఎక్కువవడం, జిల్లాల పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇసుక ను రాజకీయంగా వాడుకునేందుకు, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇసుక వ్యవహారంలో వైసిపి నాయకులు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక ఇసుక పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని కలెక్టర్లకు అప్పగించడంతో ఇక ఇసుక అక్రమాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు సైతం సూచనలు అందాయి. 


ఇప్పటి వరకు సీఎం పరిధిలో ఉన్న అన్ని శాఖల పనితీరు సక్రమంగా సాగింది. ఇక మిగతా శాఖల మధ్య పోరు పెరిగిపోవడం, జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇసుక అనేది రాజకీయ అంశంగా మారిపోయింది. నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ డ్డి నుంచి గుంటూరు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వరకు అందరూ ఇదే  విధమైన అభిప్రాత ఉండడంతో, వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇక ఇటీవల ఇసుకను ఆన్లైన్ చేయడంతో పాటు దీనిని పూర్తిగా గ్రామ, వార్డు, సచివాలయం ద్వారా బుక్ చేయాలని జగన్ నిర్ణయించుకోవడంపై ఇప్పుడు పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇప్పటి వరకు పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం జగన్ తమకు కల్పించడం లేదని వారు వాపోతున్నారు. 


జగన్ ఎక్కువగా సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లోనూ తాము అధికారంలోకి వస్తామని భావిస్తుండగా, గ్రామ స్థాయిలో మాత్రం  ఆ పార్టీ నాయకులు తాము ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతూ  వారు జగన్ తీరును బహిరంగంగానే తప్పుపడుతూ వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: