వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్.కె.రోజా జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కోసం ఎలా పడిగాపులు కాశారో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటించిన తన మంత్రిత్వ మండలిలో రోజాకు స్థానం ఇవ్వలేకపోయారు. అయితే ఆమెను బుజ్జగించేందుకు ఏపీ ఏఐసిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

 

ఇకపోతే నెల 18 జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడం ఖరారైపోయింది. దీంతో వారిద్దరూ వారి మంత్రి పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది. ఇంకా రెండు పదవులతో పాటు జగన్ తన క్యాబినెట్ లో మరికొంత మంది మంత్రులను వారి పనితీరు నచ్చక తీసేసే అవకాశం ఉందని వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే నగిరి ఎమ్మెల్యే రోజాకు వాటిలో ఏదో ఒక మంత్రి పదవి ఖాయం అయిపోతుంది.

 

ఇక రోజాకు ఎన్నో నాళ్ళగా ఎదురుచూస్తున్నా మంత్రి పదవి నల్లేరుపై నడకే అనుకుంటున్న సమయంలో ఇక్కడే మరొక కొత్త కోణం ఉంది. రాయలసీమ లో నడుస్తున్న టాక్ ఏమిటంటే క్రితం సారే రోజాకి మంత్రి పదవి రావాల్సిందని అయితే రాయలసీమ లో మంత్రులుగా ఉన్న ఇద్దరు వైసీపీ లీడర్లు ఆమెకు కావాలనే పదవి దక్కకుండా రాజకీయాలు చేశారని చెబుతున్నారు. అయితే వార్తలు రోజా వర్గం వారి నుండి వస్తున్న మాటలా లేదా సామాన్య ప్రజల నుండి వస్తున్న మాటలా అన్నది తెలియడం లేదు. రోజా కు మంత్రి పదవి వస్తే ప్రాంతంలో వారికి ఉన్న హవా మరియు గుర్తింపు తగ్గిపోతుందని వారి బాధ అట అయితే ఈసారి రోజా కు మంత్రి పదవి దక్కాలంటే వారిని మళ్ళీ ఎదుర్కోక తప్పదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: