మొదటి నుండి కరోనా విషయంలో కేసీఆర్ వైఖరి మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ప్రతి రాష్ట్రం లోని ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేసి కరోనా సోకిన వారిని ముందు జనజీవన స్రవంతి నుండి వేరు చేద్దామని చూస్తూ ఉంటే కేసీఆర్ మాత్రం తమకు నచ్చిన వారికే టెస్టులు చేస్తామని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు. దాని పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన హైకోర్టు తాజాగా ప్రభుత్వం  కరోనా గణంకాలు సరిగ్గా చెప్పడం లేదు అన్న విషయం పై ధ్వజమెత్తింది.

 

కరోనా గణాంకాలు దాచడం వలన ఎటువంటి లాభం చేకూరకపోగా దానివల్ల విపరీతమైన ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. కరోనా గణంకాలు సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని…. పూర్తిస్థాయిలో ఇకపై అన్ని రకాల వేదికలపై కరోనా పరీక్ష వివరాలు మరియు ఇతర గణాంకాలను ప్రచారం చేయండి అని హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ ను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇలా హైకోర్టు వారు హెచ్చరించి కొద్ది గంటలు కూడా కాలేదు ప్రభుత్వం రాత్రి విడుదల కావాల్సిన డైలీ కేసుల బులిటెన్ ఆలస్యం చేయడం విశేషం.

 

ఈపాటికే తెలంగాణ ప్రభుత్వం యొక్క భిన్న మరియు అనుమానపూరితమైన వైఖరిపై అనేక పిటీషాన్లు దాఖలు కాగా…. దీనికి సంబంధించి కోర్టు వారు ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వాటిలో ముఖ్యమైనది మరణించిన వారికి సంబంధించిన పరీక్షలు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి టెస్టులు జరపలేదు. విషయంలో మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు? దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి ఉంటుంది అని కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే మరణించిన వారికి ప్రభుత్వం టెస్టులు ఎందుకు చేయడం లేదు? ఇంతకీ ఏం దాస్తోంది?

 

ఇకపోతే ప్రజల్లో మీడియా ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా తగినంత అవగాహన కల్పించమని ఆదేశించిన కోర్టు…. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే మీడియా బులిటెన్ లో ఎటువంటి తప్పులు లెక్కలు ఉండరాదని హెచ్చరించి అటువంటివి ఏమైనా జరిగినట్లు తెలిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని తేల్చిచెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: