కేసిఆర్ తనయుడు టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ను ఒక పట్టాన వదిలేలా కనిపించడం లేదు. కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు రుజువు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జన్వాడ లో కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రేవంత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ ను ఉద్దేశించి మరిన్ని ఘాటు వ్యాఖ్యలు రేవంత్ చేశారు. కేటీఆర్ కు జన్వాడ లో భూములు లేవు అన్న మాటల్లో వాస్తవం లేదని, ఆయనకు రెండు చోట్ల భూములు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. 

IHG


కేటీఆర్ రెండు నెలల పాటు మంత్రి పదవికి దూరంగా ఉండి తన నిజాయితీని నిలబెట్టుకోలేరా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. తాను చెప్పినట్లుగా ఆ గ్రామంలో 301 - 13  సర్వే నంబర్లలో భూములు లేవన్న కేటీఆర్ మాటల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కేటీఆర్ కు జన్వాడలో భూములు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు నివేదిక అందించారని, అలాగే తన భూముల గురించి కేటీఆర్ ఎన్నికల ఇట్లు స్వయంగా పేర్కొన్నారని రేవంత్ తెలియజేశారు. జన్వాడ లో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, అక్కడ ఉన్న ఫామ్ హౌస్ కి కేటీఆర్ యజమాని కాదని, దాన్ని లీజుకి మాత్రమే తీసుకున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటున్నారని, 301 -313 సర్వే నంబర్ లలో తనకు ఎటువంటి భూములు లేవని కేటీఆర్ సోషల్ మీడియాలో చెప్పారని గుర్తు చేశారు. 

 

IHG's Janwada farmhouse ...


2019 మార్చి ఏడో తేదీన 301 సర్వే నెంబర్లలో రెండు ఎకరాలు కేటీఆర్ ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందని, 2018 ఎన్నికల అఫిడవిట్ లో 2 కోట్ల విలువైన ఆస్తులు జన్వాడ అర్చన వెంచర్స్ పేరు మీద ఉన్నట్లు స్వయంగా కేటీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఇక తను గురించి కూడా కేటీఆర్ బాల్క సుమన్ ఆరోపణలు చేస్తున్నారని, వారు చెప్పినట్లుగా వట్టినాగులపల్లి లో తనకు 20 గుంటలు, తన బావమరిది పేరుమీద 20 గుంటల భూమి ఉందని, ఆ భూముల స్థలంలో ఎటువంటి నిర్మాణాలు ఉన్నా, తానే కూల్చేస్తానని  రేవంత్ కేటీఆర్ కు సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: