ఒక వైపు కరోనా తన పని తాను చేసుకుంటు వెళ్లుతున్న దుర్భర పరిస్దితుల్లో, మరో వైపు ఎన్నో ప్రమాదాలు ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వస్తూనే ఉన్నాయి.. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.. అసలు మరణం అంటే లెక్కలేని రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.. ఇక లాక్‌డౌన్ నేపధ్యంలో మద్యం షాపులను మూసివేసిన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే వాటికి అనుమతులు ఇస్తున్నాయి.. ఇక కొన్ని దేశాల్లో అయితే మద్యం దుకాణాలు పూర్తిగా తెరచుకోలేదు..

 

 

ఈ పరిస్దితి ఇలా ఉంటే దాదాపుగా అన్నిచోట్ల మద్యం అనుకుని కెమికల్స్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు.. అదీగాక కల్తీ మద్యం తాగి కూడా మరణిస్తున్నారు.. ఇలాంటి ఘటనే మెక్సికో దేశంలో చోటు చేసుకుంది.. కల్తీ మద్యం తాగి 18 మంది మరణించిన విషాద ఘటన వెలుగుచూసింది. ఆ వివరాలు చూస్తే.. ట్లాపా డి కామన్ ఫోర్ట్‌ అనే కొండ ప్రాంతాల మధ్య ఉండే టౌన్‌షిప్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 18 మంది మృత్యువాత పడగా, మరో 16 మంది పరిస్థితి విషమంగా మారడంతో వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక వీరంత అక్కడున్న చిన్న పల్లెల్లో నివాసముంటున్న రైతులని మెక్సికో వైద్యాధికారులు చెప్పారు. కాగా ఈ ప్రాంతంలోని స్టోర్ల నుంచి 505 కల్తీ మద్యం బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు.

 

 

ఇకపోతే కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ తో మద్యం విక్రయాలను నిషేధించడంతో, కల్తీమద్యం మార్కెట్ లోకి వచ్చింది. దీనివల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా,ఎన్నో కుటుంబాలు దిక్కులేని అనాధలా మిగిలిపోతున్నాయి. ఇక ఇక్కడే మే నెలలో మెథనాల్ తాగి 40మంది మరణించిన సంఘటన మరవక ముందే ఈ విషాదం చోటు చేసుకుంది.. ఒక భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా కల్తీ నాయాళ్లు చేసే కక్కూర్తి పనుల వల్ల ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. దీని మూలంగా మరెన్నో ప్రాణాలు పోతున్నాయి.. ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా ఎవరు ఆగడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: