సాధారణంగా తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న నేతలకు పెద్దగా గుర్తింపు అనేది ఉండదు అని విమర్శలు వస్తు ఉంటాయి. చంద్రబాబు సహా కొందరు నేతలు చిన్న స్థాయిలో ఉన్న నేతలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు అనే విమర్శలు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని చంద్రబాబు వారి విషయంలో కాస్త ముందు నుంచి ఇదే విధంగా వ్యవహరిస్తారు. చంద్ర‌బాబు చుట్టూ పార్టీలో పెద్ద కోట‌రీ ఉంటుంది. ఆ కోట‌రీని దాటుకుని ముందుకు వెళ్లాలంటే చాలా చాలా క‌ష్టం అంత ఎందుకు ?  పార్టీ అధికారంలో ఉన్న గ‌త ఐదేళ్ల‌లో ఎంతో మంది యువ ఎమ్మెల్యేలు బాబు కోట‌రీని దాటుకుని ముందుకు వెళ్ల‌లేక‌పోయారు. ఇక జిల్లాల్లో సైతం బాబు యువ నేత‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. వృద్ధ జంబూకాలు, సీనియ‌ర్ల‌నే ప‌క్క‌న పెట్టుకున్నారు.

 

దీంతో వాళ్లంతా పార్టీ ఓడిపోయాక బాబు మాట విన‌డం కాని.. ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను లెక్క చేయ‌డం కాని మానేశారు. రాజకీయ౦గా ఆ పార్టీ ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం ఇదే అనే విమర్శలు చాలా సందర్భాల్లో వచ్చాయి కూడా. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా సరే క్షేత్ర స్థాయిలో వారు అండగానే ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత వైసీపీ నుంచి వస్తూ వస్తూ తన వర్గం మొత్తాన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. వైసీపీలో వారికి అక్కడ మంచి గుర్తింపు ఉంది. 

 

జిల్లా స్థాయి నేతలు కూడా వారు. కాని వారిని తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చిన్న స్థాయి నేతలు అనే ఆరోపణ చేస్తూ పక్కన పెట్టారు. వారికి రాజకీయం తెలియదు అంటూ అప్పుడు మంత్రులుగా ఉన్న వారు కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తన వర్గం మొత్తాన్ని తీసుకుని పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు కూడా పార్టీ కోసం పాటుప‌డుతోన్న వారిని గుర్తించ‌ని బాబోరి నిర్ల‌క్ష్య‌మే ఇప్పుడు పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే దిశ‌గా తీసుకు వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: