గత కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది.  ప్రస్తుతం కరోనాపై యుద్దం చేస్తుంది అధికార పక్షం. మరోవైపు ఏపిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  అయినా సీఎం జగన్ ఏ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకు వెళ్తూ అధికార, మంత్రి వర్గంతో కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దైర్యాన్ని నింపుతున్నారు.  కానీ ప్రతిపక్షం మాత్రం చిన్న ఛాన్సు దొరికినా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేశ్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.

 

లోకేశ్‌ వల్లే  టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట నిజం కాదా?  చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేశే కదా? అని ఆయన వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లోకి వచ్చి ఇంతకాలమైనా.. లోకేశ్ నాయకత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యేలలో‌ ఒక్కరైనా ఒప్పుకుంటారా? అని అవంతి ప్రశ్నించారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని‌ తాము మూడు రాజధానులు ప్రకటించామని, దీన్ని కుట్రలతో అడ్డుకున్నారని ఆయన చెప్పారు. విశాఖపట్నం భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. గత టీడీపీ సర్కారు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలు కూడా  చెల్లించిందన్నారు. జులై 7 న ఏపీలో 27 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: