రోజురోజుకీ ప్రపంచంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకపక్క కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరిన్ని తిప్పలు తెచ్చిపెడుతున్న తరుణంలో లాక్ డౌన్ లాంటి ఆంక్షలు పెట్టడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి.  మరో పక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం చేస్తున్న పరిశోధనలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కరోనా రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయటం గ్యారెంటీ అని ఉన్న కొద్ది కరువు లోకి ఈ వైరస్ ప్రపంచాన్ని తీసుకేలేటట్లు ఉందని ప్రపంచ మేధావులు అంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచ దేశాలకు వార్నింగ్ బెల్స్ మోగించింది WHO.

IHG's chief: Hold them both accountable for pandemic ...

రోజురోజుకీ ప్రపంచదేశాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో WHO అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల ప్రపంచంలో ఒక్కరోజులో 1,36,000 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోని పది దేశాల్లోనే 75 శాతం కేసులు ఉన్నాయన్నారు. అంతేకాకుండా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు నిరసనల వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అమెరికా దేశాన్ని హెచ్చరించారు.

IHG

చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం అమెరికాలో భయంకరంగా మారిందని చెప్పుకొచ్చారు. యూరప్ వంటి దేశాలలో మొదటిలో భయంకరంగా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లో ఉందని తెలిపారు. కానీ ప్రపంచ దేశాలలో మిగతా చోట్ల మాత్రం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, కాబట్టి ప్రపంచ దేశాలు చాలా అలర్ట్ గా ఉండాలని ఎక్కడ నిర్లక్ష్యం వహించ కూడదని చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: