దేశంలో కరోనా వైరస్ నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కువగా పేద వాళ్ళ కంటే వలస కూలీలు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నా విషయం అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటంతో ఏం చేయలేని పరిస్థితి వలసకూలీ లకు నెలకొంది. అలాంటి సమయంలో కాలినడకన దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో మండుటెండల్లో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయంలో కేంద్రం మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వాళ్లను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేకమైన బస్సులు మరియు ట్రైన్స్ నడిపారు.

IHG

ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా చొరవ తీసుకుని ప్రభుత్వాలు వలస కూలీల ను గుర్తించి 15 రోజుల్లో వారిని గమ్యస్థానానికి చేర్చాలి అంటూ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తుది ఉత్తర్వులు సుప్రీం జారీ చేసింది. తాజాగా మరొకసారి సుప్రీంకోర్టు 15 రోజుల్లోగా రాష్ట్రాలు వలస కూలీల ను ఇంటికి చేర్చే పని పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

IHG': <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUPREME COURT' target='_blank' title='supreme court-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>supreme court</a> on plea to halt migrant ...

అంతేకాకుండా తరలించిన వలస కూలీల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు పలు పథకాలు రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల నమోదు గుర్తింపు ప్రక్రియ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వలస కూలీల పై నమోదైన కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో ఈ విషయంలో వలస కూలీ లకు ఊరట కలిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: