ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. వెరసి రోజురోజుకు ప్రజల్లో  ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూసివేయబడిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.  విద్యార్థి దశ కు మొదటి మెట్టు అయిన పదో తరగతి పరీక్షల సమయంలోనే ఈ మహమ్మారి వైరస్  ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. 

 

 కేవలం పదవ తరగతి పరీక్షలు మాత్రమే కాకుండా మరిన్ని ఎంట్రన్స్ పరీక్షలు కూడా పూర్తిగా వాయిదా పడ్డాయి. ఇక తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై హైకోర్టులో చర్చ కూడా జరిగింది. అయితే పలు ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించి పలు ప్రాంతాలలో తరువాత నిర్వహిస్తామని ప్రభుత్వ వాదన వినిపించినప్పటికీ హైకోర్టు మాత్రం దానికి అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంటూ అందరూ 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్ష లేకుండా పాస్  చేస్తున్నట్లుగా ఆదేశాలు  జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన ఇంటర్నల్ పరీక్షల ప్రకారం ప్రతి విద్యార్థికి గ్రేడ్ ఇవ్వబడుతుంది అంటూ తెలిపింది. 

 


 ప్రస్తుతం తెలంగాణ రూట్ లోనే తమిళనాడు ప్రభుత్వం కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది.తమిళ నాడు  రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున అక్కడ పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి నేరుగా పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చెస్తున్నట్లుగా  తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రంలోని 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వం నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా 11వ తరగతి కి సంబంధించి జరగాల్సిన మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం  వెల్లడించింది,

 

 

అయితే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పదవ తరగతి పరీక్షలను రద్దు  చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుni చరిత్ర సృష్టించారు. కేసిఆర్ పదవ తరగతి పరీక్షలను రద్దు చేశారో  లేదో  తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అందరి విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరంపర  ఇక్కడితోనే ఆగిపోయేలా కనిపించడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దృశ్యం భారత దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రూట్ లోనే వెళ్తారని 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అందరూ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తే అది హిస్టరీలో మిగిలి పోతుంది అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: