చంద్రబాబు వారసుడు టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడుగా  నారా లోకేష్ పనికిరాడు అని మాట్లాడిన నోరులు, ఇటీవల జగన్ ఏడాది పరిపాలనపై లోకేష్ పెట్టిన ప్రెస్ మీట్ చూసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోకేష్ లో చాలా చేంజ్ వచ్చిందని..గతంలో ఉన్న నారా లోకేష్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్ కి తేడా చాలా ఉందని ఏపీ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. గతంలో మీడియా ముందు మరియు బహిరంగ వేదికలో నాలుక కరుచుకుని అనేకసార్లు లోకేష్ నవ్వుల పాలు అవ్వడం జరిగింది.  అయితే ఈ తరుణంలో ఏడాది జగన్ పరిపాలన పై నారా లోకేష్ మీడియా సమావేశాన్ని సింగిల్ గా హ్యాండిల్ చేయడంతోపాటు… ప్రభుత్వంపై సెటైరికల్ గా కామెంట్లు చేస్తూనే మరో పక్క టీడీపీ హయాంలో జరిగిన దాని గురించి లోకేష్ అద్భుతంగా చెప్పారు అని చాలామంది అంటున్నారు.

 

అంతేకాకుండా గతంలో ప్రత్యర్థులు తన బలహీనతలు ఏవైతే చెప్పారో వాటినే అస్త్రాలుగా చేసుకొని అధికార పార్టీ పై లోకేష్ వేసిన సెటైర్లు హైలెట్ అని టాక్. జగన్ ని ఉద్దేశించి వేసిన డైలాగులు నారా లోకేష్ లో కొత్తరకం పొలిటిషన్ కనబడుతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా ఇంగ్లిషు మీడియంను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి.. అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తే.. కీలక స్థానాల్లో ఉండి కూడా మాట పడాల్సి వస్తుందని.. చులక కావటం ఖాయమన్న విషయాన్ని లోకేశ్ తన మాటలతో అద్భుతంగా వివరించారు.

 

మరోపక్క ఫైర్ అవుతూ సరికొత్త దమ్ముతో ఏడాది పరిపాలనపై వైయస్ జగన్ తో ఎక్కడ ఎలాంటి ప్లేసులో అయినా చర్చకు నేను రెడీ అంటూ లోకేష్ సవాలు చేయడం టీడీపీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. లోకేష్ కొత్త దమ్ము వెనకాల కారణం ఎవరు అన్న చర్చ పార్టీలో నెలకొంది. మొన్న చూస్తే బరువు తగ్గారు ఇటీవల మీడియా సమావేశం చూస్తే అసలు నారా లోకేష్ యేనా మాట్లాడింది అన్నట్టుగా ఉంది అని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం నారాలోకేష్ లో మార్పు రావడానికి కారణం తండ్రి చంద్రబాబు అని లాక్ డౌన్ సమయం లో లోకేష్ కి చంద్రబాబు పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో చెప్పడంతో లోకేష్ లో మార్పు వచ్చినట్లు టీడీపీ అంతర్గత చర్చల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: