టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎప్పుడు ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే, అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నారా లోకేష్ కు  సమస్యలు వచ్చిపడతాయి. ఫేక్ అకౌంట్  నారా లోకేష్ ను ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఫేక్ ట్విట్ అనుభవం నారా లోకేష్ కి ఎదురైంది. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్... తన పేరుతో ఫేక్ ట్విట్  చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్ఫింగ్ ట్విట్ లతో  సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఇదంతా అధికార వైయస్సార్సిపి పార్టీ పనే అంటు  ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 

 


 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి  మ్యాటర్ వీక్ అనే విషయం పే టీఎం బ్యాచ్ కి అర్థం అయి పోయిందని... అందుకే ఐదు రూపాయల చిల్లర కోసం పేటీఎం బ్యాచ్ మొత్తం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి... టిడిపి అధ్యక్షుడు ఎంపికలో  నాయకుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఫేక్ ట్విట్  లు పెడుతున్నారు అంటు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు నారా లోకేష్. అన్నదమ్ములు లాగ ఉన్న తనకు ఎంపీ రామ్మోహన్ నాయుడు కి మధ్య గొడవలు పెట్టాలని ఈ వైసిపి పేటీఎం బ్యాచ్ ప్రయత్నాలు చేస్తోంది అంటూ చెప్పిన నారా లోకేష్ వాళ్లకి సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు.

 


 5 రూపాయల పేటియం బ్యాచ్ ఎంతలా ట్విట్ లు పెట్టి  మా మధ్య గొడవలు తలెత్తిలా చేస్తుంటే మా  మధ్య అనుబంధం అంతలా బలపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా పార్టీ అధ్యక్షుడు తో సమానమే అంటూ హితవు పలికారు. అంతేకాకుండా టీడీపీ అధ్యక్ష పదవిని రామ్మోహన్ నాయుడు ఇస్తున్నారు అంటూ... నారా శకం కింజారపు శకం అంటూ ఒక ట్వీట్ వైరల్ అవ్వగా దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... ఫేక్ అకౌంట్ తో అధ్యక్ష పదవి గురుంచి  నాయకత్వం చెప్పకుండానే పలు కథనాలు రాయడం సరైన పద్ధతి కాదు అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి పార్టీ తల్లి లాంటిది అంటూ తెలిపారు రామ్మోహన్ నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: