దో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోనా వైరస్ వ్యాప్తితో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నల్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులకు గాను, 11 పేపర్లు ఉండగా.. వాటిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి.

 

 

అయితే.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను పైతరగతికి ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం మీడియా  ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది రెండవసారట.  గతంలో ఇలాంటి సందర్భమే ఒకటి రావడంతో అప్పట్లో పదవతరగతి పరీక్షలు వాయిదా వేశారట.

 

నిజాం పాలనా కాలంలో (1951-52) జరిగిన ముల్కీ(స్థానికులకే ఉద్యోగాలు) ఉద్యమ సమయంలో స్కూళ్లను 4 నెలల పాటు మూసేశారు. అప్పుడు కూడా పరీక్షలను రద్దు చేసి అందరినీ పైతరగతులకు ప్రమోట్ చేశారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పరీక్షల నిర్వహణకు అడ్డంకి ఏర్పడింది. అప్పట్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారట.. నామ మాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరినీ పాస్ చేశారు.  అదండీ.. చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనేమో..  ఇంత కాలం తర్వాత కరోనా మహమ్మారి చేయడం వల్ల అలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: