మెగాస్టార్ చిరంజీవి, పలువురు దర్శక నిర్మాతలు ఈరోజు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన అనుమతులు, ఇతర విషయాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ జరిగింది. చిరంజీవి సమావేశం అనంతరం మాట్లాడుతూ సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు సీఎం జగన్ అనుమతిచ్చారని తెలిపారు. 
 
సినీ ప్రముఖులంతా కలిసి ఏడాది కాలంగా కలవాలని అనుకున్నామని కానీ కుదరలేదని అన్నారు. కరోనా కారణంగా షూటింగులు లేక చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడిందని చెప్పారు. సీఎం జగన్ అనుమతులు ఇచ్చారని.... థియేటర్ లకు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని అన్నారు. నంది వేడుకలు పెండింగ్ లో ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటున్నామని అన్నారు. 
 
201920 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. టికెట్స్ ధరలు... ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరామని చెప్పారు. సీఎం జగన్ ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారని వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. జులై 15 తర్వాత నుంచి షూటింగులు మొదలవుతాయని అన్నారు. 
 
కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే వచ్చారని అన్నారు.  సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, టాలీవుడ్‌ ప్రముఖులు నాగార్జున, దిల్‌ రాజు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సురేశ్‌ బాబు, సి, కళ్యాణ్‌ ఇతరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించిందని అన్నారు. విశాఖపట్నంలో స్టూడియోకు దివంగత మహానేత వైఎస్సార్‌ భూమి ఇచ్చారని... అక్కడ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: