జనం అంటే ఓటర్లు.. జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆ కృతజ్ఞత ఓట్లరూపంలో బదిలీ అవుతుంది. సామాన్య జనం కోరుకునేది వారి నిత్యావసరాలు తీరాలనే. అంతకు మించి వారు విశ్లేషణ చేసే అవకాశాలు తక్కువ. అందుకే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేస్తే.. జనం మళ్లీ గెలిపిస్తారు. ఇందుకు వైఎస్ విజయమే ఓ ఉదాహరణ.

 

 

కానీ.. ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంటే.. పథకం పొందేందుకు లంచాలు, రెకమండేషన్లు, సిఫారస్సులు ఉంటే.. జనం తిరస్కరిస్తారు. అయితే ఇప్పుడు జగన్ మరో కొత్త పద్దతి ప్రవేశపెడుతున్నారు. ప్రజలకు అవసరమైన కీలక పథకాలకు టైమ్ ఫిక్స్ చేస్తున్నారు. దీని ప్రకారం.. గ్రామంలో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో బియ్యం కార్డు ఇవ్వాల్సిందే.. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పెన్షన్‌ కార్డు ఇవ్వాల్సిందే.

 

 

అంతేనా.. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు అందించాలి. ఇక దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఈ మేరకు జగన్ కొత్త పద్దతి తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాల్లో మొత్తం లబ్ధిదారుల జాబితా పెట్టడమే కాకుండా.. ఆ పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రదర్శిస్తారు. జాబితాలో పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మార్గదర్శకాలు పొందుపరిచారు. మరి జగన్ చెప్పినట్టు పది రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు.. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు.. 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగితే.. జనం జగన్‌ను గుండెళ్లో పెట్టి చూసుకుంటారు.

 

 

ఇచ్చిన గడువులో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అర్హులని తేలితే.. కచ్చితంగా ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనట. ఇందుకోసం గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్‌కు ఈ బాధ్యతను అప్పగించారట. దరఖాస్తుల పరిశీలన తీరు ఏ విధంగా ఉందనేది కలెక్టర్లు కూడా సమీక్ష చేస్తారట. జాయింట్‌ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహిస్తారట. ఇది నిజంగా అమలైతే.. జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: