లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను నటుడు సోనూసూద్...దేవుడి వ‌లె ఆదుకున్న విష‌యం తెలిసిందే. సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సోనూసూద్‌.. రియ‌ల్ లైప్లో మాత్రం హీరోగా వ్య‌వ‌హ‌రించాడ‌ని సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై అభిమానం చాటుకుంటున్నారు..నెటిజ‌న్లు. అయితే తాజాగా సోనూసూద్‌కు వ‌స్తున్న క్రేజ్‌ను శివ‌సేన బుర‌ద జ‌ల్లేందుకు య‌త్నిస్తున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చే సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం జ‌రిగింది. వలస కార్మికులను కలుసుకోవడానికి వెళ్లిన నటుడు సోనూసూద్‌ను ముంబైలోని బాంద్రా రైల్వే టెర్మినల్‌ సమీపంలో పోలీసులు అడ్డుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశంగా మారింది.


శివ‌సేన కావాల‌నే చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డ‌టంతో స్వ‌యంగా పోలీస్‌శాఖ అధికారులు స్పందించి వివ‌ర‌ణ ఇచ్చారు.   సోనూసూద్‌ని మేము అడ్డుకోలేదు. ఆయనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌నే (ఆర్‌పీఎఫ్) అడ్డుకున్నద‌ని ముంబైలోని నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి  పేర్కొన్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే బాంద్రా నుంచి వలస కార్మికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఉత్తరప్రదేశ్‌కి వెళ్లడానికి రైల్వే స్టేషన్కు పెద్ద సంఖ్య‌లో చేరుకున్నారు. ఇందులో చాలా మంది పేద‌లు, అత్యంత నిరుపేద‌లు ఉన్నారు. వారికి అవ‌స‌ర‌మైన న‌గ‌దును అంద‌జేసేందుకు సోనూసూద్ బాంద్రా రైల్వే స్టేష‌న్‌లోకి వెళ్లేందుకు చేరుకున్నారు.


 అయితే పోలీసులు అనుమ‌తించ‌క‌పోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇదిలా ఉండ‌గా సోనూసూద్‌ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. సోనూ చేస్తున్న స‌హాయ కార్య‌క్ర‌మాల‌పై శివసేన నేత సంజయ్‌ రౌత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఏకంగా శివ‌సేన అధికారిక ప‌త్రిక సామ్నాలో లాక్‌డౌన్ వేళ కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారంటూ సోనూపై వ్యంగాస్త్రాల‌తో ఓ క‌థ‌నం రాశారు. శివ‌సేన బీజేపీ చేతిలో కీలు బొమ్మ‌గా మారార‌ని ఆరోపించారు. బీజేపీ ఆడిస్తున్న నాట‌కుడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు సోనూసూద్ ఒప్పుకున్న ఓ స్టింగ్ ఆపరేషన్‌పై సైతం సంజయ్ రౌత్ స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: