మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ జగన్ కు నేరుగా ఒక సవాల్ విసిరారు. బాలకృష్ణ సినిమా డైలాగ్ తో జగన్ ను ఛాలెంజ్ చేశారు. టైం నువ్వు చెప్పినా సరే... నేను చెప్పినా సరే....? ప్లేస్ నువ్వు చెప్పినా సరే.... నేను చెప్పినా సరే....? ఎప్పుడైనా సరే... ఎక్కడైనా సరే...? అనే డైలాగ్ తో సవాల్ విసిరారు. పరోక్షంగా ఏడాది వైసీపీ పాలనపై టీడీపీ చర్చకు సిద్ధమని వ్యాఖ్యలు చేశారు. 
 
ఏడాది పాలనపై ఛార్జిషీట్ ను విడుదల చేసి... ఆ ఛార్జిషీట్ లో తీవ్రమైన అభియోగాలు మోపుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరి లోకేష్ సవాల్ కు జగన్ ఏ విధంగా స్పందిస్తారు...? అనే ప్రశ్నకు జగన్ లోకేష్ విమర్శలను అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. జగన్ నుంచి లోకేష్ వ్యాఖ్యలకు స్పందన వచ్చే అవకాశమే లేదని... లోకేష్ మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ భావిస్తున్నాడని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఒక రకంగా చెప్పాలంటే జగన్ కేసీఆర్ ను ఫాలో అవుతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి టీ.ఆర్.ఎస్. పార్టీపై ఏవైనా విమర్శలు చేస్తే సీఎం కేసీఆర్ వెంటనే స్పందించేవారు. రేవంత్ పై ఘాటుగా విమర్శలు చేసేవారు. ఆ సమయంలో రేవంత్ టీడీపీలో ఉండేవారు. తరువాత కాలంలో కేసీఆర్, కేటీఆర్ రేవంత్ విమర్శలకు స్పందించడం లేదు. దీంతో రేవంత్ వ్యాఖ్యలను పత్రికలు కూడా పట్టించుకోవడం లేదు. 
 
ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యే అధికారులు కౌంటర్లు ఇస్తున్నారు. లోకేష్ విషయంలో జగన్ పట్టించుకోకపోయినా టీడీపీ అనుకూల మీడియా మాత్రం లోకేష్ కు ప్రచారం కల్పిస్తోంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీలో భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ కు ఎదురైన పరిస్థితే లోకేష్ కు ఎదురవుతుందేమో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: