ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు...అదే పార్టీలో మొన్నటివరకు ఉన్న కరణం బలరామ్‌లు సహచరులు అనే విషయం రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లో మొదలైన సంగతి కూడా తెలిసిందే. ఆయనతో పాటే కరణం బలరామ్ రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ప్రారంభమైంది. 1978లో ఈ ఇద్దరు కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేలు గెలిచారు.

 

అయితే బాబు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో అప్పుడే కరణం కూడా టీడీపీలోకి వచ్చారు. కాకపోతే మధ్యలో ఒకసారి కరణం మళ్ళీ కాంగ్రెస్‌లోకి వెళ్ళిన బాబు తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చారు. ఏదైనా గానీ కరణం రాజకీయ జీవితం ఎక్కువ టీడీపీతోనే నడిచింది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా టీడీపీ పార్టీలో పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా చీరాల నుంచి పోటీ చేసి అదిరిపోయే మెజారిటీతో గెలిచారు.

 

కానీ ఒక్కసారిగా బాబుకు షాక్ ఇస్తూ కరణం జగన్ జై కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్ధతు తెలిపారు. అయితే టీడీపీని వీడాక కొంతకాలం సైలెంట్‌గా ఉన్న కరణం...తాజాగా మీడియా ముందుకొచ్చి బాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీ చాలా నష్టపోయిందని, ఎన్నికల్లో ఓటమికి టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని, వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శించినా.. ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని మాట్లాడారు.

 

ఈ క్రమంలోనే బాబు కూడా స్పందిస్తూ...తన సహచరుడైన కరణంకు పరోక్షంగా కౌంటర్లు వేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలి పోతారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని, ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని లాస్ట్‌లో ఓ డైలాగ్ వేశారు. అయితే బాబు చెప్పేది కూడా నిజమే పార్టీకి ద్రోహం చేసేవారిని ప్రజలు ఆదరించరు. 2014 ఎన్నికల్లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని ప్రజలు ఆదరించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: