తన సుధీర్ఘ పాదయాత్రలో ఆడపడుచులు కష్టాలు తెలుసుకుని దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి, భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్...సీఎం పీఠం ఎక్కగానే ఇచ్చిన హామీని అమలు చేయడం మొదలుపెట్టారు. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా 20 శాతం షాపులని తగ్గించి, మద్యం రేట్లు పెంచి షాపులని ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకున్నారు.

 

ఇక ఆ కార్యక్రమాన్ని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ ఎత్తేశాక కూడా షాపులని తగ్గించి, రేట్లు విపరీతంగా పెంచారు. దీంతో మద్యం షాపులు వైపు వెళ్లాలంటేనే మందుబాబులు జంకుతున్నారు. అయితే మందు లేకుండా ఉండలేని వాళ్ళు మాత్రం అటు వైపు వెళుతున్నారు. కాకపోతే ఈ విషయంలో మందుబాబులు ప్రభుత్వం పట్ల అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది.

 

ఈ విధంగా రేట్లు పెంచడం వల్ల మందుబాబులు ఏం చేయాలో తోచడం లేదు. తమ దగ్గర నుంచి ప్రభుత్వం ఈ విధంగా ఎక్కువ డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదనే భావనలో ఉంటున్నారు. అలాగే మద్యం బ్రాండ్లు విషయంలో కూడా వారు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే దీనిపైన టీడీపీ రాజకీయం చేసి, జగన్ ప్రభుత్వాన్ని ఇంకా ఇరుకున పెట్టేందుకు చూస్తోంది. మద్యం ధరలు పెంచి పేద ప్రజల కడుపుకొడుతున్నారని ప్రచారం చేస్తూ, మందుబాబులని రెచ్చగొడుతున్నారు.

 

అయితే ఈ విషయంలో జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గరని అర్ధమైపోతుంది. ఆడపడుచుల కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఖచ్చితంగా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ ఇదే విషయంలో లబ్ది పొందేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదనీ రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. ఇక టీడీపీ రాజకీయ ఎత్తుగడలు ఎన్ని వేసినా..జగన్‌ మాత్రం వెనక్కి తగ్గరని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: