ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పూర్తిగా అధికారుల మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అండాలన్నా, ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరాలన్నా, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని భావించిన జగన్ మొదటి నుంచి వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ శ్రేణులను సైతం పక్కన పెట్టారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా పూర్తిగా అధికారులను బాధ్యులను చేస్తూ, జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరి మాట వినకుండా, మొత్తం అధికారుల కే మొత్తం బాధ్యతలు అప్పగించారు.

IHG'ble cm Sri <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS jagan MOHAN REDDY' target='_blank' title='ys jagan mohan reddy-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ys jagan mohan reddy, held a review meeting on ...

ముఖ్యంగా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను కల్పించారు జగన్. అనుకున్నట్టుగానే జగన్ నిర్ణయం సక్సెస్ ఫుల్ గా అమలవుతూ వస్తోంది. ఏడాది పరిపాలనలో తాను ఏమి చేయగలనో అనేది జగన్ చేసి చూపించారు. ఈ విషయంలో అధికారులు పాత్ర కూడా కీలకమే. ప్రస్తుతం కొన్ని అంశాలలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ మరింతగా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలని  నిర్ణయించారు. దీనిలో భాగంగా అధికారులకు భరోసా ఇచ్చే విధంగా జగన్ మాట్లాడారు. మీ వెనక సీఎం ఉన్నాడని, అక్రమ ఇసుక మద్యం స్మగ్లింగ్ వంటి విషయాల్లో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి వారు ఉన్నా, వదిలి పెట్టొద్దని జగన్ సూచించారు.

IHG

సీఎం మీతో ఉన్నారని ఈ విషయంలో మీరు ఎంత దూకుడుగా ముందుకు వెళ్లినా ఫర్వాలేదని, మద్యం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఒక క్రమపద్దతి ప్రకారం మద్యం రేట్లు పెంచుతున్నామని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు. ఏపీలో మధ్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేద్దామని చూస్తుంటే మద్యం అక్రమ రవాణా ఎక్కువ అయ్యిందని, ఇలా జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమ మద్యం రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద జగన్ చెప్పారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IHG

ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున మద్యం అక్రమ మార్గంలో వస్తుందని, ఈ మేరకు వందల కేసులు నమోదు అవుతున్నాయని, దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దెబ్బతింటోందని భావించిన జగన్ ఈ వ్యవహారంపై సీరియస్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేయడంపైన జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి తప్పిదాలు జరగకుండా పూర్తిగా అధికారులకు పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈవిధంగా భరోసా ఇవ్వడంతో అధికారుల్లోనూ మరింత ధీమా పెరిగినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: