ఏపీ సీఎం జగన్ రాజకీయంగా బాగా ముదిరి పోయారు. ఎక్కడ ఏ వ్యవహారం చేస్తే, ఏ విధంగా తమకు కలిసి వస్తుందో అనే విషయాలపై ఆయన పూర్తిగా అవగాహన పెంచుకున్నారు. అలాగే తమ రాజకీయ శత్రువులను ఏవిధంగా కట్టడి చేయాలనే విషయంలోనూ, జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తూ, తమ రాజకీయ ప్రత్యర్ధులను కట్టడి  చేయగలుగుతున్నారు. జగన్ ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఉంటూ అందరివాడు గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక విషయానికి వస్తే...  ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా ఉండేది. ఆ పార్టీ తరఫున ప్రచారానికి దిగడం, కొంతమంది ఎన్నికల్లో పోటీ చేయడం, ఇలా టాలీవుడ్ లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఓటమి చెందడం, వైసీపీ అధికారంలో ఉండటంతో మెజారిటీ సినీ ప్రముఖులంతా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు.

IHG


 ఎన్నికలకు ముందే చాలా మంది వైసీపీలో చేరగా, మరికొంతమంది చేరకుండానే  జగన్ కు జై కొట్టారు. ఇక ఇప్పుడు జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం జగన్ కు జై కొడుతూ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వంటి వారు జగన్ విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. గతంలో చిరంజీవిని తన ఇంటికి పిలిచి మరీ, జగన్ విందు ఏర్పాటు చేశారు. ఆ తరువాత జగన్ తనతో వ్యవహరించిన తీరును చిరంజీవి పదేపదే గొప్పగా ఫీల్ అయ్యారు. తన తమ్ముడు పవన్ రాజకీయ పార్టీని నడుపుతున్నా పట్టించుకోకుండా చిరంజీవి జగన్ కు జై కొట్టారు. టాలీవుడ్ అగ్రహీరో మహేష్ సైతం పరోక్షంగా జగన్ విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. తన సొంత బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నా, మహేష్ మాత్రం జగన్ కి పరోక్షంగా జై కొడుతున్నారు. 

IHG


జగన్ సీఎంగా గెలిచిన కొంతకాలం తర్వాత మహేష్ తన భార్య నమ్రత ను పంపించి జగన్ సతీమణి భారతి ద్వారా కృష్ణ సొంత గ్రామం బుర్రిపాలెం  అభివృద్ధికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. వెంటనే జగన్ ఆ నిధులను మంజూరు చేశారు. దీంతో జగన్ మహేష్ ల మధ్య మరింత సఖ్యత ఏర్పడింది. అలాగే కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా త్వరలో వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో సమావేశమై తన చేరికపై చర్చించారు. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే, మెగాస్టార్ చిరంజీవి తరచుగా జగన్ తో భేటీ అవుతూ ఆయనకు మద్దతు పలుకుతున్న తీరు పవన్ కు చాలా ఇబ్బంది కలిగించే అంశం. 

IHG


ఎందుకంటే ఒకవైపు పవన్ సినిమా హీరోగా, మరోవైపు రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో తాను ఏవిధంగా స్పందించినా, అది చిక్కులు తెచ్చి పెట్టే అంశంగా మారుతుంది. అందుకే ఈ విషయంలో పవన్ ఏమి మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ మొత్తం తన వైపు ఉండేలా చేసుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: