ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తయింది. అసలే మంచి కసి మీద అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ .. సహజంగానే తన శత్రువర్గమైన టీడీపీ నేతలను టార్గెట్ చేశారట. వారిని కోలుకోలేకుండా దెబ్బలు తీస్తున్నారు. వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నారట. ఈ దెబ్బలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే.. టీడీపీ నేతలు తట్టుకోలేక పార్టీ నుంచి వెళ్లిపోతున్నారట.

 

 

ఈ విషయాలన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం నేతల ఆర్థిక మూలాలను వైసిపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన ఓ సమావేశంలో వాపోయారట. పార్టీ ఇన్ చార్జీలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ఈ కామెంట్లు చేశారట. టీడీపీలో ఉన్న బలమైన లీడర్లను కేసులు, జరిమానాలతో బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

 

 

అంతే కాదు.. పార్టీకి ద్రోహం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటివారు చరిత్రహీనులుగా మారిపోతారని చంద్రబాబు అంటున్నారు. ప్రజలు అలాంటివారిని సహించారని ఆయన అన్నారు. అలాంటివారికి దూరంగా ఉండాలని కూడా చంద్రబాబు సూచించారు. వైసిపి ప్రభుత్వం పై పెట్టిన చార్జీషీట్ ను ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చంద్రబాబు తన పార్టీ నేతలతో అన్నారు.

 

 

అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను జగన్ దెబ్బ తీస్తున్నాడంటే.. టీడీపీ నేతలవి అక్రమ వ్యాపారాలు, అనైతిక కార్యకలాపాలు అని చంద్రబాబు అంగీకరస్తున్నారు.. అలాగైతే.. తప్పుడు వ్యాపారాలు, అక్రమా వ్యాపారాలను కట్టడి చేస్తే తప్పేంటి.. ఇలాంటి వ్యవహారాలు ఎవరు చేసినా తప్పే కదా.. అందులో పార్టీలు అనే కాన్సెప్టే ఉండదు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: