పైన పటారం లోన లొటారంలా ఉంది నేటి రాజకీయనాయకుల పరిస్దితి.. పైకి ఖద్దరు బట్టలేసుకుని గాంధేయవాదుల్లా కనిపిస్తారు..లోన మాత్రం బకాసూరుల అవతారం ఎత్తి ఎన్నో అక్రమాలు చేస్తుంటారు.. అవినితి మచ్చ అంటని ఒక్క రాజకీయనాయకుడు మనదేశంలో కనిపించడు.. పైకి పెద్దమనుషులుగా పిలవబడతారు.. ఇకపోతే ఇప్పటికే జేసీ బ్రదర్స్ మీద రవాణశాఖ ఎన్నో కేసులు నమోదు చేసిందన్న విషయం తెలిసిందే.. తాజాగా జేసీ బ్రదర్స్‌ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్‌పై 24 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌, ఎస్‌ఏవీ ప్రసాదరావు తెలిపారు.. బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించినట్లు పేర్కొన్నారు..

 

 

ఆయన మంగళవారం విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ పి.శ్రీనివాస్, జాయింట్‌ కమిషనర్‌ ఎల్‌ఎస్‌ఎం రమాశ్రీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలు తెలిపారు.. అవేంటంటే.. జేసీ బ్రదర్స్‌ కంపెనీ, అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్‌–3 లారీలను స్క్రాప్‌ కింద విక్రయించగా.. వాటిని  కొనుగోలు చేసింది. అలా కనుగోలు చేసిన వాటిని వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారట. ఇక ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది. కాగా మరో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారని పసిగట్టిన రవాణా శాఖ, ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన మొత్తం లారీలను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలని ఆ శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు లేఖ రాశారు.

 

 

ఈ నేపధ్యంలో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడమే కాకుండా, జాతీయ డేటాబేస్‌ ‘వాహన్‌’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరారట.. ఇక  అనంతపురంలో 80 లారీలు, కర్నూలులో 5 లారీలు, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున దొంగ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలుండగా ఆ లారీల బీమా పత్రాలను పరిశీలిస్తే. అవి కూడా నకిలీవేనని తేలాయి. ఇకపోతే ఈ విషయంలో యునైటెడ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బీమా కంపెనీలకు సమాచారం ఇచ్చారట. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్‌ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు అధికారులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: