దేశాన్ని కరోనా పట్టి పీడిస్తుంటే, మనుషుల మనసులను మాత్రం కౄరత్వం పట్టి పీడిస్తుంది.. కరోనాతో చచ్చే వారు చావక అనవసరంగా జంతువులను, పక్షులను పొట్టన పెట్టుకుంటున్నారు.. అమాయక జీవుల ప్రాణాలను ఈ మధ్య కాలంలో దారుణంగా తీస్తున్నారు.. మతి చలించి ఇలా ప్రవర్తిస్తున్నారో ఏమోగానీ ఏనుగులను, కుక్కలను ఇలా ఏ జంతువునైనా వదలడం లేదు.. చివరికి కౄరమృగాలను సైతం చేతికి దొరికితే వాటికంటే కౄరంగా చంపుతున్నాడు.. ఇక తాజాగా కూడా తన స్వార్ధం కోసం 11 నెమళ్లకు విషం పెట్టి చంపాడు ఒక రైతు..

 

 

తన పంటపొలాన్ని రక్షించు కోవడానికే ఇలా చేశానని చెబుతున్న, దానికి ఎన్నో మార్గాలుండగా ఈ హింసా మార్గాన్నే ఎంచుకోవలసిన అవసరం లేదు.. వాటి ప్రాణాలు తీసే హక్కు లేదు.. మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. తిరుపూర్‌ జిల్లా తారాపురం సమీపంలో ఉన్న చిన్న ప్రాంతం పేరు పుత్తూర్‌. ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. కాగా వీటిని ఆ సమీప ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయని ఇదివరకే పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారట..

 

 

ఈ నేపధ్యంలో స్థానిక రైతులు సోమవారం ఉదయం సమీప పొలంలో 11 నెమళ్లు మృతి చెంది పడి ఉండడాన్ని గుర్తించి, వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వ్యవసాయశాఖ అధికారి తిరుమూర్తి, అటవీశాఖ ఉద్యోగి మణివన్నన్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అందులో భాగంగా అక్కడి వారిని విచారించగా అదే ప్రాంతానికి చెందిన రైతు ముత్తుస్వామి కుమారుడు‌ ఆ నెమళ్లకు విషం పెట్టి చంపినట్లు ఒప్పుకున్నాడట. తన పంటను ఆ నెమళ్లు నాశనం చేస్తుండటంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: