దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ దాదాపు 10,000 కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. దేశంలో నిన్నటివరకు 2.67 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అన్ లాక్ 1.0లో భాగంగా దేశంలో ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యాయి. త్వరలో అన్ లాక్ 2 కూడా అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే లాక్ డౌన్ ను ఇండియాలో లాంటి దేశాల్లో సడలిస్తే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికాలో మాదిరిగా సమూహ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతోంది. 
 
అయితే ఇదే సమయంలో జూన్ 25వ తేదీ నుంచి దేశంలో తిరిగి లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉందని... ఈసారి ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నారని.... ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ ఎత్తేసి తిరిగి లాక్ డౌన్ ను ప్రకటించాయని.... మన దేశంలో కూడా లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఈ వార్త గురించి అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్రం ఈ వార్తపై ఇప్పటివరకు స్పందించలేదు. కేంద్రం స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించటంతో జూన్ 30 నాటికి పరిస్థితులను పరిశీలించి కేంద్రం లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: