జనరల్‌గా సర్కార్ దవాఖాన కంటే, ప్రైవేట్ హస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ బాగా చేస్తారని ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. ఇక్కడ ప్రైవేట్ లేక సర్కార్ హస్పిటల్ అన్నది ముఖ్య విషయం కాదు.. వైద్యం చేసే వైద్యుడు ఎలాంటి వారు అన్నదే ఇక్కడ ముఖ్యం.. అతను అంకిత భావంతో వైద్యాన్ని తాన బాధ్యతగా భావించి చేస్తే రోగికి న్యాయం జరుగుతుంది.. కానీ నేటి డాక్టర్లు ఎలా తయారు అయ్యారంటే వారు గవర్నమెంట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వచ్చే పేషెంట్స్‌ను తన హాస్పిటల్‌కు రిఫర్ చేస్తారు..

 

 

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఒక మహిళకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేపిస్తే సదరు హస్పిటల్ వైద్యులు సర్జరీ సమయంలో ఉపయోగించే క్లాత్, కాటన్‌కూడా ఆ కడుపులో పెట్టి కుట్లేసారు.. ఇదెక్కడో వేరే రాష్ట్రంలో జరిగిన ఘటన కాదు.. సాక్షాత్తు నగరంలోనే జరిగింది.. ఆ వివరాలు చూస్తే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ(43) అనే మహిళ గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోందట.. ఈ క్రమంలో ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించగా కడుపులో కణితులు ఉన్నాయని హైదరాబాద్‌ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారట అక్కడి వైద్యులు.. ఈ మేరకు లాలమ్మకు గతేడాది ఫిబ్రవరిలో ఇక్కడి వైద్యులు ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపించారు.

 

 

కాగా ఇటీవల మళ్లీ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్‌ఘాట్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో చేర్పించగా, వారు కూడా కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్‌ చేయాలని అనగా.. అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో వారు ఆపరేషన్‌ చేయగా అందులో ఆశ్చర్యకరంగా కణితులతో పాటు ఆపరేషన్‌లో వినియోగించే పత్తి ఉండలు  బైటపడగా షాక్ అయిన వారు గతంలో ఎక్కడ ఆపరేషన్‌ చేయించారో, ఆ హస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంగా ఇలా చేసారని చెప్పడంతో, ఈ మహిళ కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి వద్దకు వెళ్లగా, అది కాస్త మూసివేశారని తెలియడంతో, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బాధితురాలి కుమారుడు శేఖర్‌ పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: