జగన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలన నిజంగా స్వర్ణ యుగమే అన్నట్లుగా నడిచింది. ప్రజలకు ఉన్న అవసరాలను ముందుగానే గుర్తించి జగన్ వారి కష్టాలను తీర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ప్రతి ప్రభుత్వ పథకం డోర్ టూ డోర్ అందేలా ఏర్పాటు చేశారు. గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా, వారు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాలు లబ్ధిదారుల ఇంటికి అందేలా చేయగలిగారు. ఇలా చెప్పుకుంటే జగన్ ఏడాది పాలనలో ప్రజలపై అనుకున్నదానికంటే ఎక్కువగానే చేసి చూపించారు. ఇక జగన్ కూడా వేరే ఆలోచన లేకుండా మొత్తం పరిపాలన మీద దృష్టి పెట్టారు. తాను ఇచ్చిన హామీలు ఎంత కష్ట తరమైన లెక్కచేయకుండా అమలు చేసి చూపించారు. 

IHG' List After <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ELECTION COMMISSION' target='_blank' title='ec-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ec</a> Notification


ఆఖరికి కరోనాతో ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, సంక్షేమ పథకాలు ఎక్కడ అపకపోగా, మరి కొన్ని కొత్త పథకాలను ప్రకటించి ఔరా అనిపించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే జగన్ పరిపాలన లో ఎక్కడ అ ఎవరికీ ఏ లోటు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఒక్క విషయంలోనే జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడ్డ కేడర్ విషయంలో జగన్ పట్టించుకోకపోవడం, మొత్తం పరిపాలన పైన దృష్టి పెట్టి పార్టీ నాయకులను పక్కన పెట్టడం వంటి పరిణామాలతో ఇప్పుడు వైసీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేపుతున్నాయి. అసలు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా మొత్తం అధికారులు తోనే జగన్ పరిపాలన చేస్తుండడం, పార్టీ నాయకులను పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరించడం వంటి అంశాలు పార్టీ నాయకుల్లో నిరాశ నిస్పృహలను నింపుతున్నాయి.


IHG

 

గత టీడీపీ ప్రభుత్వం లోనూ చంద్రబాబు నాయుడు ఇదే వైఖరితో వెళ్లారు. పూర్తిగా అధికారులపైనే నమ్మకం పెట్టుకొని పార్టీని పెద్ద పట్టించుకోనట్టు గా వ్యవహరించారు. ఇప్పుడు అదే రకమైన తప్పును జగన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది. పార్టీ, ప్రభుత్వం రెండు రెండు కళ్ళు లా చూసినప్పుడు మాత్రమే జగన్ అనుకున్నది సాధించగలుగుతారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలతోపాటు, పార్టీ నాయకులు కృషి తప్పకుండా ఉండాల్సిందే. కేవలం అధికారులను మాత్రమే నమ్ముకుని జగన్ ముందుకు వెళితే పార్టీ కేడర్ లో అసంతృప్తి పెరిగిపోయి అది వైసీపీకి శాపంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పుడిప్పుడే పార్టీ నాయకుల్లోనూ, ప్రజా ప్రతినిధులోనూ, పెరిగిపోతున్న అసంతృప్తి మీడియా ముఖంగా బయటపడుతోంది. మరిన్ని అసంతృప్తులు జరగకముందే జగన్ జాగ్రత్తపడిది మంచిది అనే సూచనలు ఇప్పుడు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: