బాలక్రిష్ణ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన వయసు అరవై. మనసు మాత్రం పసిదే. పైగా ఆయన దూకుడు, జోరు, హుషార్ చూసిన వారికి ఆయనకు అరవైయేళ్ళు అంటే అసలు నమ్మరు. బాలయ్య సూపర్ స్టార్ డం ని ఇండస్ట్రీలో చూశారు. ఇప్పటికీ నాటౌట్ అంటూ సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడా తగ్గను అంటున్నారు.

 

ఇక బాలయ్య రెండు సార్లు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.  2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో మొత్తానికి మొత్తం టీడీపీ దిగ్గజాలు ఓడిపోయినా కూడా బాలయ్య గెలిచాడు అంటే అది రికార్డే. ఇక బాలయ్య టీడీపీలో మొదటి నుంచి ఉన్నారు. ఆయన తన తండ్రి వెంటనే  ఉంటూ పార్టీకి  ప్రచారం చేస్తూ వచ్చారు.

 

మూడున్నర దశాబ్దాల  క్రితమే ఎన్టీయార్ తన రాజకీయ వారసుడు బాలయ్య అన్నారు. అది మదనపల్లి ఎన్నికల ప్రచారంలో అన్న గారు చెప్పిన మాట. మదనపల్లి చిత్తూరు జిల్లాలో ఉంది. ఆ వెంకటేశ్వరుడు ఉన్న జిల్లా అది అటువంటి పవిత్రమైన చోట అన్న గారు అన్న మాటలు వ్రుధాగా పోవు కదా.

 

దానికి సమయం సందర్భం ఇపుడు వచ్చిందా అనిపిస్తోంది. తెలుగుదేశం పాటీ ఇపుడు ఇబ్బందులో ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని ఓటమి పార్టీకి వచ్చింది. దాంతో పార్టీ కిందా మీదా అవుతోంది. అటువంటి పార్టీకి నందమూరి నాయకత్వం అవసరమని కూడా అంతా కోరుతున్నారు.

 

పార్టీకి ఈ మధ్య దూరమైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం బాలయ్య అయినా జూనియర్ ఎన్టీయార్ అయినా టీడీపీకి  నాయకత్వం వహించాలని కోరడం మరచిపోకూడదు. బాలయ్య సైతం పార్టీని గాడిన పెట్టడానికి నేను ఎపుడైనా రెడీ అంటున్నారు.

 

ఈ మధ్య మీడియా నుంచి వచ్చిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే తాను తీసుకుంటానని అనడం విశేషం. ఓ వైపు క్యాడర్ కి బాలయ్య నాయకత్వం కావాలని ఉంది. బాలయ్య సైతం సై అంటున్నారు. మరింకెందుకు ఆలస్యం. అరవయ్యేళ్ళకే ఎన్టీయార్ రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చి ప్రభంజనం స్రుష్టించారు.  అదే రక్తం. పౌరుషం ఉన్న బాలయ్య కూడా వస్తే టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తున్నది అంటున్న వారు ఎక్కువగానే  ఉన్నారు. మరి ఆ రోజు కోసం అంతా వెయిట్ చేయాల్సిందేనేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: