ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఆన్‌లైన్‌ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే మరో ఘటన ఇది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం వల్ల ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయిన ఘటన విశాఖలోని అరకులోయ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన కౌశిక్‌ అనే యువకుడు పదేపదే పబ్జీ గేమ్‌ ఆడేవాడు. ఇటీవల ఆ గేమ్‌ ఆడుతోన్న సమయంలో ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.  ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి అతడు వెళ్లిపోయాడని డాక్టర్ తెలిపారు.

IHG

బాధితుడికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని తెలిపారు. పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. ప్రస్తుతం  దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అతడికి వైద్యులు ప్రథమ చికిత్సచేసిన అనంతరం... పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని సూచించారు. 

IHG

అయితే పబ్ జీ ఆటలో లీనమైన వీరంతా తాము ఏం చేస్తున్నామన్న విషయం కూడా గమనించలేదని పోలీసులు తెలుపుతున్నారు.  పబ్ జీ గేమ్ పిల్లలు, యువతపై  భయంకరమైన ప్రభావం చూపుతోందని పోలీసులు తెలిపారు. ఇకపై పబ్ జీ ఆడేవారిని అరెస్ట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా చాలా మంది చిన్నా పెద్దా సీక్రెట్ గా పబ్ జీ గేమ్ ఆడుతూనే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: