2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో కేంద్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది బిజెపి. అయినా కానీ రాజ్యసభలో మాత్రం మెజార్టీ ఫిగర్ అందుకోవడంలో ఆరు సంవత్సరాల నుండి విఫలమవుతూనే ఉంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తా తాటక పోయిన పార్లమెంటులో తన పట్టు నిలుపుకోవడం లో విఫలమైన రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంటోంది. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా తమ హవా ని  రాజ్యసభలో కొనసాగిస్తున్నయి. దీంతో రాజ్యసభ లో మెజార్టీ సాధించడం విషయంలో బీజేపీ కి అందని ద్రాక్ష‌లానే పరిస్థితి మారింది. ప్రస్తుతం రాజ్యసభ బలాబలాల విషయానికొస్తే… రాజ్యసభలో బీజేపీ కి 75 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 39 స్థానాలు కలిగి ఉంది.

 

ఈ తరుణంలో జూన్ 19 వ తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో వచ్చే రిజల్ట్ బట్టి చూస్తే 9 స్థానాలు కైవసం చేసుకుని బిజెపి పార్టీ స్థానాలు 84 కు చేరుకోబోతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కోల్పోయి 37 కి పరిమితం కానుంది. అయితే ఇక్కడ బిజెపి పార్టీకి పొలం పెరిగిన గాని రాజ్యసభలో మాత్రం మెజారిటీ వచ్చే అవకాశం లేనట్టే అని చాలామంది అంటున్నారు.

 

మొత్తం 242 మంది పెద్దల సభ కలిగిన రాజ్యసభలో మెజారిటీ 122. కాబట్టి ఎన్డీఏ ఇంకా 22 స్థానాలను తన ఖాతాలో వేసుకుంటే గాని రాజ్యసభలో బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో పార్లమెంటులో బిజెపి కీలకమైన బిల్లులు విషయంలో తన పంతం నెగ్గించుకున్న పెద్దల సభలో మాత్రం భారీ ఓటమి దిశగా ఎక్కువ మెజార్టీ స్థానాలు లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: