దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళ సీఎం కూతురి మతాంతర వివాహం చేసుకోవడానికి సిద్ధమైయ్యారు. ముఖ్యమంత్రి కుమార్తె స్టారప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక పెళ్లి కొడుకు ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. కేరళ సీఎం కూతురికి గతంలో వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి కొడుకు గతంలో పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు కరోనా కాలంలో సీఎం కూతురు, ప్రముఖ రాజకీయ నాయకుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

 

 

సీపీఎం రాజకీయ పార్టీ అనుభంద సంస్థ అయిన డీవైఎఫ్ఐ జాతీయ విభాగం అధ్యక్షుడిగా పీఏ. మహమ్మద్ రియాజ్ పని చేస్తున్నారు. సీపీఎం కమిటీలో కూడా మహమ్మద్ రియాజ్ ఉన్నారు. కేరళలోని కోజికోడ్ కు చెందిన మహమ్మద్ రియాజ్ మళయాలంలో విద్యాభ్యాసం చేశారు. చురుకైన రాజకీయ నాయకుడిగా మహమ్మద్ రియాజ్ కు మంచి పేరు ఉందన్నారు. ప్రతినిత్యం టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. గోవు మాంసం సరఫరా చెయ్యాలని పోరాటం చేస్తున్న వారికి మద్దతుగా మహమ్మద్ రియాజ్ కేరళలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు. 

 

 

కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా, సీపీఎం నాయకుడు మహమ్మద్ రియాజ్ ల వివాహం జూన్ 15వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో సీఎం కూతురు వీణా, మహమ్మద్ రియాజ్ ల పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిపించాలన్నారు. వారి వివాహం కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిపారు. మొత్తం మీద సీఎం కూతురు వీణా రెండో పెళ్లి, ఇద్దరు బిడ్డల తండ్రి మహమ్మద్ రియాజ్ తో జరగడానికి డేట్ ఫిక్స్ అయిపోయిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: