ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం గా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇప్పుడు సంచలనంగానే ఉంటుంది. ఆయన సంక్షేమ కార్యక్రమాలు అయినా అవినీతి విషయంలో అయినా సరే తనకు అడ్డం వచ్చిన వాటి విషయంలో అయినా సరే ఆయన ఖ‌చ్చితంగా.. కఠినం గా వ్యవహరిస్తారు అని సొంత పార్టీ నేత‌లే అంటూ ఉంటారు. ఆ విషయంలో ఆయన వద్ద నుంచి అసలు రాజీ ఇప్పుడు ఏ మాత్రం లేదు అని అంటున్నారు కొందరు. త‌మ కేబినెట్లో ఉన్నా మంత్రులు అయినా స‌రే.. సీనియ‌ర్ నేత‌లు అయినా కూడా ఎవ‌రు అయినా క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించినా.. గీత దాటితే ఏ మాత్రం ఉపేక్షించే ప‌రిస్థితి లేద‌ని చెప్పేశార‌ట‌.

 

అంతెందుకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి గ‌త కొద్ది రోజులుగా జ‌గ‌న్‌ను.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, ఇరుకున ప‌డేసేలా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం ఆనంను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప‌నులు కాకుండా మ‌రింత ఇబ్బంది ప‌డుతున్నారు. తాజాగా రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నేత పార్టీలో వర్గాలు తయారు చేస్తున్నారు అని అదే విధంగా పార్టీలో ఆయన కొందరిని దూరం చేస్తున్నారు అని జగన్ కి పక్కా సమాచారం అందింది. 

 

ఇసుక అక్రమాలను ఆయన గోదావరి జిల్లాలకు వెళ్లి  మంత్రి హోదాలో చేస్తున్నారు అని జగన్ వద్దకు పూర్తి ఆధారాలు వచ్చాయి. ఆయనకు ఇదే విషయాన్ని ఒక యువ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పారు. అయినా సరే పెద్దగా ఆ విషయాన్ని సదరు  మంత్రిగారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అని టాక్. తనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేశారు అని సమాచారం. ఇప్పుడు ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించడానికి గానూ జగన్ సిద్దమయ్యారు. ఇదే విషయాన్ని ఒక సీనియర్ నేత ద్వారా ఆయనకు పార్టీ అధిష్టానం చెప్పింది. ఇప్పుడు జగన్ ని  కలవడానికి ఆయన తాడేపల్లి వస్తున్నా సరే సాధ్యం కావడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: