జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైం లో వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్న తరుణంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోవటం ఆ టైంలో ఉప ఎన్నికలు రావడం వైసీపీ ఓడిపోవటం అందరికీ తెలుసు. ఈ దెబ్బ వైయస్ జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని వైసీపీ చాప్టర్ క్లోజ్ అనుకున్న టైంలో జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశారు. వెంటనే స్టార్ట్ చేసి పార్టీ గ్రాఫ్ కింద పడకుండా జాగ్రత్త పడటం ఆ తర్వాత ఎన్నికలలో గెలిచి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న విషయం మనకు అంతా తెలుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఆ టైంలో జరిగిన ఉప ఎన్నికలలో భూమా నాగిరెడ్డి మరణించడంతో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన బ్రహ్మానంద రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.

IHG

ఉప ఎన్నికల టైములో తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ 2019 మెయిన్ ఎన్నికలు వచ్చే టైంకి తనకు వ్యతిరేకంగా టికెట్ రాకుండా తెరవెనుక పావులు కదిపినట్లు వార్తలు రావడంతో అప్పట్లో ఆళ్లగడ్డ లో పెద్ద రాజకీయమే నడిచింది. టికెట్ వ్యవహారంలో చంద్రబాబు కన్ఫ్యూజన్ అయినా గాని చివరాకరికి బ్రహ్మానందరెడ్డి కే ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం జరిగింది. కాని ఓటమి పాలయ్యారు.

IHG

ముందు నుండి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి భూమా బ్రహ్మానంద రెడ్డిని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అఖిల ప్రియ భావించిన భూమా బ్రహ్మానందరెడ్డి తన సొంత నిర్ణయాలతో వ్యవహరించడంతో 2019 సార్వత్రిక ఎన్నికలలో తన ఓటమి వెనుక అఖిలప్రియ హస్తం ఉన్నట్లు భూమా బ్రహ్మానందరెడ్డి భావిస్తున్నట్లు టాక్. దీంతో ప్రస్తుతం పార్టీలో ఉన్న ఆమె హవా  ఉన్న కొద్దీ పెరుగుతున్న తరుణంలో… వైసీపీ పార్టీలో నాయకులు చాలామంది ఆళ్లగడ్డలో పట్టు పూర్తిగా పెంచుకోవడానికి భూమా బ్రహ్మానంద రెడ్డి ని వైసీపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: