క‌రోనా రోగుల‌కు స‌రైన వ‌స‌తులు ఉండ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వైద్య‌శాఖ అధికారులతో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ గాందీ ఆస్ప‌త్రిలోని ప‌రిస్థితో పాటు ఇత‌ర జిల్లాల్లోని ఆస్ప‌త్రుల్లో వైద్య స‌దుపాయాల తీరుపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు మరియు పర్యవేక్షకులతో కోవిడ్ -19  మరియు ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఇతర శాఖల సమన్వయంతో  మూడు నెలలుగా కోవిడ్ వ్యాధితో పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. క‌రోనాను కట్టడి చేయడంలో విజయం సాధించామని అభినందించారు. అయితే ఆసుపత్రులు తమ వసతులు పెంచుకోవాలని, కొవిడ్ గ  నిర్ధారణ అయితే తప్ప హైదరాబాద్‌కు పంపించ కూడదని, రోగులకి ధైర్యాన్ని కలుగ చేస్తూ భయాందోళనకు గురి కాకుండా చికిత్స కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఇక నుంచి పూర్తిస్థాయిలో అన్ని రకాల జాతియ ఆరోగ్య కార్యక్రమంల  అమలుపై దృష్టి పెట్టి లక్ష్య సాధన  కోసం కృషి చేయాలని, ప్రధానంగా మధుమేహ రోగుల‌కు హైప‌ర్ టెన్ష‌న్‌ వ్యాధిగ్రస్తులకు  ఇంటి వద్దకే మందుల సరఫరా చేయాలని సూచించారు. 

 

అదేవిధంగా  మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని,దోమతెరలు త్వరితగతిన  పంపిణీ మరియు గృహముల నందు దోమల నివారణ మందును క్రమపద్ధతిలో త్వరితగతిన  పిచికారి  చేయించాలని, కాలానుగుణంగా వచ్చే సీజ‌న‌ల్ వ్యాధులు వైరల్ ఫీవర్,  విరోచనాలు , కామెర్లు ,టైఫాయిడ్,  మొదలగు వ్యాధుల పైన కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. , ప్రతి ఒక్కరికీ మాస్కులు ధరించడం, కనీసం ఒక మీటరు భౌతిక దూరమును పాటించడం, పలుమార్లు చేతులు శుభ్రపరచడం బయట మూత్ర విసర్జన చేయడం వంటి అంశాలపై  అవగాహన చేయాలని,108, 102 వాహన సేవలను విస్తృత పరచాలని, కుటుంబ నియంత్రణ సేవలుఅందించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: