కరోనా వైరస్ పై ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వద్దని, ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్రత మరింతగా పెరుగుతూ, చెయ్యి దాటి పోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. పాకిస్థాన్ కరోనా దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సోమవారం నాడు తొలిసారిగి దాదాపు 100 కరోనా మరణ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2172కు చేరుకుంది.  కరోనా కేసులు నమోదవడంతో అక్కడ కరోనా కేసుల సంఖ్య 108317కి చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్‌బులిటెన్‌లో వెల్లడించింది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైంది.  కరోనా కేసుల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న సింధ ప్రావిన్స్‌లో దాదాపు 40 వేల కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 35 018 మంది కోలుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 

కరోనా వైరస్ వ్యాపించకుండా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వంగా గట్టిగా హెచ్చరిస్తున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటికి వారికి జరిమానాలు కూడా భారీగానే వడ్డిస్తున్నారు. మనదేశంలోనే కాదు, పొరుగు ఉన్న పాకిస్తాన్‌లోనూ చాలా మంది మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు.  దాంతో అక్కడ  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా కనిపించిన వారికి కరెంటు షాకులు ఇస్తున్నారు. టేజర్ గన్లతో స్వల్పస్థాయిలో కరెంటు పెడుతున్నారు. 

 

ఆ షాకుల వల్ల వల్ల ప్రాణాపాయం ఉండదు. అయితే గుండెజబ్బులు, ఇతర తీవ్ర వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరమే.  జరిమానాలు అయితే సింపుల్ గా కట్టి పోతున్నారని.. అయితే కఠిన శిక్షలు అమలు చేస్తే మాస్క్ తప్పకుండా పెట్టుకుంటారని వారి ఉద్దేశం అంటున్నారు.  కాకపోతే అలా షాక్ పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయంటున్నాయి హక్కుల సంఘాలు. కార్లలో వెళ్లే వారికి, బడాబాబులకు కాకుండా కూలినాలి చేసుకునేవారికే కరెండు షాకులు ఇస్తున్నారని మండిపడుతున్నాయి.  దీంతో చాలామంది మాస్కులు పెట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: