దేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో పూర్తిగా రవాణా, సినీ, ఇతర వ్యాపార రంగాలన్నీ మూసివేశారు.  ముఖ్యంగా జనసందోహంగా ఉండే ప్రతి ఒక్కటి పూర్తిగా మూసి వేశారు.   ఆ మద్య బార్బర్ షాపు ద్వారా అక్కడ వాడే వస్తువుల ద్వారా కరోనా విస్తరిస్తుందని తెలియగానే చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఒకదశలో సెలూన్ షాప్ కి వెళ్తే ఆదార్ తప్పని సరి చూపించాలని కండీషన్లు కూడా పెట్టారు. ఈ మద్య హెయిర్ సెలూన్లు నెమ్మదిగా తెరుచుకున్నాయి.  జనం భయం భయంగా కటింగ్ చేయించుకుంటున్నారు. కొందరు వ్యాపారులు ఆ భయాన్ని అనుకూలంగా మలచుకుని వెంట్రుకలతో పాటు జేబులు కూడా కట్ చేస్తున్నారు.

 

ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో శుభ్రత, పరిశుభ్రత చార్జి పేరుతో భారీ దోపిడీకి తెరశాడు.  కొంత మంది అయితే తమ వెంటన మాస్క్ తో పాటు టవల్స్ కూడా తీసుకు వెళ్తున్నారు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వక్యక్తికి సెలూష్ షాప్ యజమాని వేసిన బిల్లు చూసి ఖంగు తిన్నాడు.  చెన్నై సెలూన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి  హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేయించుకున్నాడు. తర్వాత బిల్లు చూసి తలతిరిగిపోయింది. కటింగ్, ట్రిమ్మింగ్ చార్జీ కింద రూ. 250తోపాటు  శుభ్రత  చార్జి కింద రూ. 150 వడ్డించారు. దీకి జీఎస్టీ కూడా కలిపి రూ. 445 అయింది.  

 

అంతే ఒక మద్యతరగతి వారికి ఇలాంటి బిల్లు చూస్తే నిజంగానే షాక్ తినడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు అమలు చెయ్యాలంటే తాము శుభ్రతపై అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని కనుక కస్టమర్ల నుంచి అదనంగా పిండుకుంటున్నామని సెలూన్లు చెబుతున్నాయి. ఢిల్లీలో అయితే దోపిడీ మరీ దారుణంగా ఉంది. రూ. 250 వరకు అదనంగా వడ్డిస్తున్నారు. ఈ వడ్డింపు జీఎస్టీ అదనం. మరోవైపు  శానిటైజర్లు, సబ్బులు పేరుతో కబుర్లలో పెట్టి మరీ దండుకుంటున్నారని కస్టమర్లు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: