తెలుగుదేశం పార్టీకి ఇపుడు గడ్డు కాలమే నడుస్తోందని చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది అయినా కూడా ఇంకా కోలుకొని స్థితిలో టీడీపీ ఉంది. తెలుగుదేశం ఎత్తిగిల్లుతుందన్న ఆశ కూడా ఈ కోశానా కనిపించడంలేదు. నిజానికి ఇది గతానికి పూర్తి భిన్నమైన సీన్. 2004, 2009 ఎన్నికలలో కూడా తెలుగుదేశం పరాజయం పాలు అయింది. అయితే నాటికీ నేటికీ చాలా తేడా ఉంది. ఈసారి ఓడితే టీడీపీ ఇంటికే అని ముందే జోస్యాలు వచ్చాయి. అదే ఇపుడు జరగబోతోందా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

తెలుగుదేశం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తాజాగా బాంబు పేల్చారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మంత్రి ఈ విధమైన ప్రకటన చేసారు అంటే సైకిల్ దిగే తమ్ముళ్ళు ఎక్కడ  ఏ జిల్లాకు చెందిన వారు అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. విశాఖ నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో కొందరి మీద ఇప్పటికే అనుమానం చూపులు ఉన్నాయి.

 

దానికి తోడు అన్నట్లుగా ధర్మాన కృష్ణదాస్ చేసిన ఈ భారీ ప్రకటన పచ్చ పార్టీలో ప్రకంపనలు  సృష్టిస్తోంది. తెలుగుదేశం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అదే విధంగా పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా సైకిల్ దిగిపోతారని ఓ వైపు టాక్ నడుస్తోంది. మరో వైపు చూసుకుంటే ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీకి గుడ్ బై కొడతారు అని టీడీపీ  ఎమ్మెల్యే కరణం బలరాం జోస్యం చెబుతున్నారు.

 

వీటి నేపధ్యం చూసినపుడు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష మంత్రం గట్టిగా మళ్ళీ పనిచేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష పాత్రకు ఎసరు పెట్టాలన్నదే టార్గెట్ గా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. దాంతో ఎమ్మెల్యే తమ్ముళ్ళు పెద్ద ఎత్తున సైకిల్ దిగిపోతారని ప్రచారం సాగుతోంది. మరి దానికి ముహూర్తం ఎపుడు, ఏంటి అన్నది రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: