నందమూరి బాలకృష్ణ.. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న కుర్రాడనే చెప్పాలి. ఆయన వ్యక్తిగత జీవితంలోకి వస్తే.. ఆయన తండ్రి ఎన్టీఆర్ ను దైవ సమానంగా చూస్తారు.. ఆయన మీడియాతో మాట్లాడిన వేళల్లో ఎక్కువ శాతం మా నాన్నగారూ.. అంటూ మాట్లాడతారు. దీన్ని చాలా మంది వెటకారం చేస్తారు. కానీ తండ్రిని దైవంలా పూజించే బాలయ్య లాంటి కొడుకులు చాలా అరుదన్న సంగతి గ్రహించరు.

 

 

బాలయ్యకు ఎన్టీఆర్ అంటే ఉన్న భయం, భక్తి, గౌరవం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ బాలయ్య ఎన్టీఆర్ తర్వాత ఎవరిని అమితంగా గౌరవిస్తారు.. అమితంగా ఇష్టపడతారు.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా ఇంట్రస్టింగా ఉంటుంది. అయితే ఇదే ప్రశ్నకు ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం చాలా షాకింగ్ గా ఉంది. అదేంటంటే.. మా నాన్న ఎన్టీఆర్ తర్వాత నేను గౌరవించేది నన్నే.. అవును నేనే.. నాన్న ఎన్టీఆర్ తర్వాత నేనే అంటూ షాక్ ఇచ్చారు.

 

 

అదీ బాలయ్య ఆత్మాభిమానం.. ఇందుకు బాలకృష్ణ రీజనింగ్ కూడా చెప్పాడు. అసలు మనుషుల్లో మొత్తం నాలుగు రకాల మనుషులు ఉంటారని చెప్పిన బాలయ్య అందులో తాను మొదటి రకం వాడినని చెప్పారు. తనది రుజు స్వభావం అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇది తన గురించి తాను చెప్పుకోవడం కాదని ఆయన వివరించారు. అది తన గొప్పదనం కాదని.. కానీ.. తనకు ముక్కుసూటి తనం ఉంటుందని.. చెప్పుకొచ్చారు.

 

 

తనది చాలా స్వచ్ఛమైన స్వభావం అని వివరించారు. తనది కుళ్లు, కుతంత్రాలకు తావులేని మనస్తత్వమని బాలయ్య చెప్పుకొచ్చారు. తనకు కౌటిల్యం, చాటుమాటు తత్వం లేదని వివరించారు. ఏదైనా ఉంటే కుండబద్దలు కొట్టేస్తానని బాలయ్య అన్నారు. తనది రామానుజాచార్యుల వంటి మనస్తత్వమని చెప్పారు బాలయ్య. నలుగురికి మంచి జరుగుతుందంటే.. తనకు కీడు జరిగినా పరవాలేదనుకుంటానని బాలయ్య చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: