కరోనా వైరస్ ఎదుర్కోవాలంటే కచ్చితంగా రోగనిరోధకశక్తి ఇంటిలో ఉన్నవారు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచ దేశాలు చెబుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో కరోనా వైరస్ ప్రపంచంలో ఎంటర్ అయిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే రోగనిరోధకశక్తి ప్రజలలో పెరిగే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి ఉన్నవారిపై వైరస్ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలడం తో పాటు అనేక మంది వైద్యులు కూడా తెలపడంతో ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ సిస్టం పెంచే విధంగా డైట్ ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. అయితే మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే అధ్యయనాలు చెబుతున్న విషయాలు గురించి ఒకసారి తెలుసుకుందాం. 

 

1)మొదటిగా వ్యాయామం రోజుకి కనీసం అరగంట సేపు చేయటం వల్ల ఒంటి లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కనీసం వారంలో ఐదు రోజులు పాటు వ్యాయామం చేయటం మంచిదని ఇమ్యూనిటీ పవర్ పెరుగుతోందని అంటున్నారు. 

 

2)అదేవిధంగా నిద్ర కనీసం రోజుకి ఏడు గంటల నుంచి 8 గంటల పాటు ఆరోగ్యకరమైన నిద్ర తీసుకుంటే చాలా మంచిదని, అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు.

 

3)అలాగే బయట దొరికే జంక్ ఫుడ్ లు మరియు చిరుతిండ్లను మానేయటం, పిజ్జాలు బర్గర్లు, రెస్టారెంట్ ఐటమ్స్ వంటివి తినడం మానేసి ఇంటిలోనే విటమిన్స్ దొరికే పోషకాలు, మినరల్స్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. 

 

4)అలాగే తినే తిండి తో పాటు వ్యాయామంతో పాటు వ్యక్తిగత శుభ్రం చేతులను ఎప్పటికప్పుడు కడుకోవటం వంటివి చేయడం వల్ల ఎటువంటి వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, నివసించే చోట పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

 

5)అలాగే ఒత్తిడి లేకుండా స్ట్రెస్ లేకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణాన్ని అనుభవించాలని, మానసికంగా బలంగా ఉండే మెడిటేషన్ లాంటివి చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కరోనా వైరస్ మీ దగ్గరికి రాదు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు రోగనిరోధక శక్తి లేకపోవడం వల్లే వారిపైనే ప్రభావం చూపిస్తోందని కాబట్టి రోగనిరోధకశక్తి ఎంత ఉంటే అంత బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: