టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మంచి పట్టున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవం బాబు సొంతం. పలువురు ప్రధానులని, రాష్ట్రపతులని ఎంపిక చేసే విషయంలో చంద్రబాబు పాత్ర బాగానే ఉంది. అయితే ఇదే విషయాలని చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. ఇప్పటికీ కూడా వీటిపై మాట్లాడతారు. కాకపోతే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పింది ఒకప్పుడు గానీ...ఇప్పుడు కాదు. 2004 నుంచి బాబుకు కేంద్రంలో పట్టు తగ్గిపోయింది.

 

ఇక 2014లో కూడా ఏపీలో అధికారంలోకి వచ్చినా...కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నా సరే బాబు పప్పులు ఉడకలేదు. బాబు అనుకున్న విధంగా సెంట్రల్‌లో కార్యక్రమాలు జరగలేదు. బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండటంతో బాబు అన్నిటికి బ్రతిమలాడుకోవడమే సరిపోయింది. ఈ క్రమంలోనే బాబుని కేంద్రంలో మరింత దెబ్బ కొట్టేలా జగన్ స్కెచ్ వేసి, అదిరిపోయే రాజకీయం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఇరుకున పెట్టి, బీజేపీ నుంచి బాబుని విడిపోయేలా చేశారు.

 

బీజేపీ నుంచి విడిపోయాక బాబు పరిస్తితి ఏమైందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిసినా కూడా మోదీని ఏం చేయలేకపోయారు. మోదీ మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేశారు. పైగా ఇటు ఏపీలో బాబు ఘోరంగా ఓడిపోగా, జగన్ బంపర్ మెజారిటీతో అధికారం లోకి వచ్చారు. అయితే ఓడిపోయాక బాబు...బీజేపీతో కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేసిన అవేమీ వర్కౌట్ కాలేదు.

 

అదే సమయంలో జగన్...బీజేపీతో మంచి సన్నిహిత సంబంధాలు మెయిన్‌టైన్ చేస్తూ...బాబుకు కేంద్రంలో స్కోప్ లేకుండా చేశారు. పైగా ఈ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా, అందులో వైసీపీకి 4 స్థానాలు రానున్నాయి. దీంతో వైసీపీకి మొత్తం 6 గురు సభ్యులు ఉండనున్నారు. ఇక రాజ్యసభలో బీజేపీ మెజారిటీ తక్కువ కాబట్టి, వైసీపీ సపోర్ట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది.

 

అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే... వచ్చే ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అప్పుడు కూడా జగన్ మద్ధతు కోసం ప్రయత్నించవచ్చు. కాబట్టి బాబుకు..బీజేపీ దగ్గరయ్యే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. అలా అని బాబు కాంగ్రెస్ వైపు వెళ్ళినా...కాంగ్రెస్ ఓ 10 సంవత్సరాల వరకు బలంగా పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ. మొత్తానికైతే బాబు చక్రాన్ని జగన్ విరగొట్టేసినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: