కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. అందరి భవిష్యత్తు లను తలకిందులు చేసింది. ఈ వైరస్ రాక వల్ల భవిష్యత్తులో అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని అనుకున్న వారి ప్లాన్స్ మొత్తం తారుమారు అయిపోయాయి. ప్రపంచంలో అగ్రరాజ్యంగా అని విర్రవీగిన దేశాలు కూడా కరోనా వైరస్ ముందు తలదించాయి. కొద్ది నెలల్లోనే కొన్ని లక్షల మందిని బలి తీసుకుంటూ ఉన్న కొద్దీ బలపడుతోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ఈ వైరస్ ని అంతమొందించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం చాలా దేశాల వైద్యులు రాత్రి పగలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.

 

ఇటువంటి తరుణంలో వచ్చే సెప్టెంబర్ కల్లా ఆక్సఫర్డ్ యూనివర్సిటీ మరియు బ్రిటీష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి ప‌రుస్తున్న క‌రోనా వైర‌స్ విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మానవులపై తొలిదశ లో చేసిన ప్రయోగాలు సక్సెస్ అయినట్లు ఇటీవల ఈ సంస్థలు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మరో దశలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగం చేయనున్నట్లు… ఇది గనుక విజయవంతమైతే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినట్టే అని ఈ సంస్థ‌లు చెబుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో పదివేల మంది వాలంటీర్ల పై చివరిదశ వ్యాక్సిన్ ప్రయోగం చేస్తున్నట్లు ఈ సంస్థలు చెప్పు కోచ్చాయి. ఇప్పటికే వారిని ఎంపిక చేసుకోవడం జరిగిందని వివిధ వయసుల వారిపై ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చివరిదశ ప్రయోగం చేస్తున్నట్లు… వచ్చిన ఫలితాలు బట్టి వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉంటుందో స్పష్టత వస్తోందని ఈ సంస్థలు అంటున్నాయి. దీంతో చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: